వేక్సిన్ వస్తుందా..అస్సలు నమ్మకండి..కనీసం ఏడాదిపైనే..!


భారత్ వేక్సిన్ తయారీకి ముందుకు రావడంతో ఇక వేక్సిన్ రావడమే తరువాయి అనుకుంటున్నారా..లేదు..వేక్సిన్ ఆరునెలల్లో అంటే ఈ ఏడాది చివరికి తయారైనా సరే..అందుబాటులోకి రావడానికి మాత్రం ఇంకా సమయం పడుతుంది..

 భారత్‌లో కరోనాకి సొంతంగా వ్యాక్సిన్‌ తయారీకీ బీజం పడిన వేళ వేక్సిన్ టాస్క్‌ఫోర్స్ పెద్దలు కీలకమైన ప్రకటన చేశారు..చేసింది..ఏడాది సమయంలోనే వేక్సిన్ తయారవుతుంది..ఐతే అందుబాటులోకి రావడానికే ఇంకా ఆలస్యమవుతుందంటూ వేక్సిన్ టాస్క్‌ఫోర్స్ కో ఛైర్ పర్సన్ కే విజయరాఘవన్ అభిప్రాయపడ్డారు..ఎందుకంటే ఏ వేక్సిన్ తయారు చేసినా..ముందు అది ఏ మేరకు పని చేస్తుంది..దాని సమర్ధత ఎంత..ఎంత సంఖ్యలో ఉత్పత్తి చేయాలి..వాటి పంపిణీ ఎలా చేయాలనే అంశాలు తర్వాతి దశలో కీలకంగా మారతాయ్..ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయరాఘవన్ చెప్తున్నారు..ఐతే ప్రస్తుతానికి మాత్రం అంతా సవ్యంగానే  సాగుతుందని..అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కరోనాకి వేక్సిన్ ఏడాదిలోపే వచ్చేస్తుందనేది ఆయన అభిప్రాయం..ఐతే జనంలోకి రావడానికి మాత్రం అంతకి మించిన సమయం పడుతుందన్నది ఆయన మాట

ఇక మిగిలిన విషయాలు చూస్తే ( కరోనా వేక్సిన్ క ి సంబంధించి)
భారత్‌లోనే కరోనాకి వేక్సిన్ కనుక్కునే 30 ప్రయత్నాలు జరుగుతున్నాయ్..పార్మా కంపెనీలు..పరిశోధకులు..సైంటిస్టులు వీరంతా కలిసి సమన్వయంతో కలిసి కనుక నడిస్తే...వీలైనంత తొందరగానే వేక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయమనే నిపుణుల అభిప్రాయం

 ప్రపంచవ్యాప్తంగా వందలాది పరిశోధనలు కరోనాపై సాగుతుండగా..కొన్ని క్లినికల్ ట్రయల్స్ దశకి చేరుకోవడం కూడా గమనించాలి..అసలు ఏ వ్యాధికైనా వేక్సిన్ తయారై జనంలోకి అందుబాటులోకి రావాలంటే పది నుంచి 15ఏళ్లు పడుతుంది..ప్రతి వేక్సిన్ ఆవిష్కరణకు 200 మిలియన్ డాలర్లనుంచి 300 మిలియన్ డాలర్ల ఖర్చవుతుంది..ఒక్కసారంటూ వేక్సిన్ డిజైన్..డెవలప్ మెంట్ పూర్తైందంటే..ఇక ఆ మోడల్‌ని వాడుకుని..ఇతర దేశాల్లో కూడా వేక్సిన్ తయారీ మొదలుపెట్టవచ్చు..ఐతే ఇందుకు అక్కడి ఫార్మా కంపెనీలతో వేక్సిన్ డెవలప్ చేసిన కంపెనీ, దేశం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది..ఐతే ఈ మధ్యలో వేక్సిన్‌ ట్రయల్స్ మరింత ముఖ్యం..తయారు చేసిన వేక్సిన్ అనేక దశలు, అనుమతులు, ప్రయోగాలు, ఫలితాల దశలను దాటుకుని జనంలోకి వస్తాయ్..అందుకే ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వంద పరిశోధనలన్నీ కూడా ఇలా అన్ని దశలూ టెస్ట్ చేయకుండా..సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూ..వచ్చిన ఫలితాలను బట్టి..రెండో దశ...మూడో దశకి రావాలంటారు..మధ్యలో కొన్ని టెస్టులను..ప్రయోగాలను స్కిప్ చేస్తేనే..వేక్సిన్ తయారీకి పట్టే సమయం తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఇప్పటిదాకా వేక్సిన్ డెవలప్ చేసే దశలు పది ఉన్నాయనుకుంటే..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాల ఫలితాలను అధ్యయనం చేసుకుంటూ..ఆ దశలను అన్ని సంస్థలూ చేయకుండానే రెండు మూడు దశల్లోనే పూర్తి చేయాలంటారు విజయరాఘవన్..అప్పుడే కొన్ని బిలియన్ డాలర్లమేర ఖర్చు తగ్గుతుంది..బోలెడంత సమయం కూడా కలిసి వస్తుంది

మరోవైపు ఫలితాల గురించి ఆలోచించకుండా..పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది..వాటిని వాడవచ్చు లేదంటే వాడకపోవచ్చు..ఈ క్రమంలోనే ఉత్పత్తి వ్యయం పెరిగేది..ప్రపంచదేశాల్లోని ప్రయోగాల మాట ఎలా ఉన్నా..భారత్‌లో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కోసమైనా..వేక్సిన్లు అవసరం..దానికోసమైనా..ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవాలి.

.ప్రస్తుతం భారత్ మూడు విధాలుగా వేక్సిన్ తయారీలో భాగస్వామిగా మారింది..ఒకటి ప్రపంచస్థాయిలో జరుగుతున్న వేక్సిన్ డెవలప్‌మెంట్ ప్రయోగంలో ఇక్కడి సంస్థల క్రియాశీలక భాగస్వామ్యం..అక్కడ వేక్సిన్ సక్సెస్ అయితే..ఇక్కడి సంస్థలు కోట్ల సంఖ్యలో డోసుల ఉత్పత్తికి
రెడీ అవుతాయ్..రెండోది..ఇతర ప్రపంచదేశాల్లో ఎక్కడ వేక్సిన్ తయారైనా మన దేశపు ఫార్మా సంస్థలతో తయారీ ఒప్పందం చేసుకోవడం..ఎందుకంటే కొన్ని వందలకోట్ల సంఖ్యలో వేక్సిన్ డోసులను అత్యంత వేగంగా..తక్కువ ఖర్చుకు తయారు చేసే సామర్ధ్యం భారత ఫార్మా సంస్థల సొంతం..మూడోది ఐసిఎంఆర్, భారత్ బయోటెక్‌తో కలిసి రీసెంట్‌గా ప్రకటించిన స్వదేశీ వేక్సిన్ తయారీ..ఇలా మూడు రకాలుగా భారత్ వేక్సిన్ తయారీలో కీలకంగా మారింది
మరి తెలంగాణ ముఖ్యమంత్రెందుకు జులై ఆగస్ట్ కల్లా వచ్చేస్తుందంటారా...అది కేవలం డెవలప్ అయిన వేక్సిన్ గురించి చెప్పడం అయి ఉంటుంది..ట్రయల్స్ సక్సెస్ అవగానే...వాడతారని కూడా ఆయన చెప్పలేదుగా ..వస్తుందని చెప్పాడు..అంతే..ఆ..( ఏముందింక..అంతే

Comments