ఛెన్ద్రబాబుగారూ..మీ నుంచి ఇంతకంటే మేం ఏం ఆశించగలం..మీరు గెలవకపోవడం మా ఖర్మ అంతే


ఆత్మస్థుతి పరనిందలో పిహెచ్డీలకు మించిన డిగ్రీ ఏదైనా ఉందంటే అది ఆయనకే సొంతం కావాలి..మరీ ఇంతగా దిగజారిపోయిన చంద్రబాబును చూస్తారని బహుశా ఆయన పార్టీ లీడర్లు కూడా ఊహించి ఉండరు..నేనైతే..నేనైతే అంటూ ఊగిపోతున్న చంద్రబాబుగారు..పుష్కరాల సమయంలో ఏం ఒరగబెట్టారో కావాలనే గుర్తు చేస్తున్నారుా...?

అందుకేనేమో నిన్న జగన్ అలా అన్నది..ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ..." మనుషులను తీసుకురాలేం కానీ...కోటిరూపాయల నష్టపరిహారం ఇస్తాం..అండగా ఉంటామని ప్రకటించాడు..ఈ మాట అన్న తర్వాతైనా చంద్రబాబు నోటికి తాళం పడుతుందేమో అని వైఎస్సార్సీపీ లీడర్లు అనుకున్నారు..అబ్బే అలాగైతే నా గొప్పేముందీ అనుకుని ఉంటాడాయన..

అందుకే గొప్పగా కోటిరూపాయలు ఇస్తారా...ఏం సరిపోతుందీ అంటాడాయన...మరి మన హయాంలో జరిగిన ఘోరాలకు ఏమని సమాధానం చెప్తాడు..అంతెందుకు ఇవాళేగా..రైల్వే ట్రాక్ పై పడుకున్న వలసకార్మికులను గూడ్స్ తొక్కుకుంటూ పోయింది..మరి మీ స్నేహితుడు మోదీ గారు...రైల్వేశాఖ ఎంత సాయం ప్రకటించిందో చెప్పండి బాబయ్యా....

డిమాండ్ చేయండి బాబయ్యా మోదీని కూడా బాధ్యత మరిచిపోయారని...పైగా గూడ్స్ రైలు వేగమెంతండయ్యా ఉండేది...ఆయినా కూడా ఆపలేకపోయారే...మరి కంపెనీ చేసిన తప్పిదానికి ప్రభుత్వమే దగ్గరుండి లీక్ చేయించిందన్నంత కసిగా మాట్లాడుతున్నారే...
నిజమే బాబయ్యా తమరుండాలయ్యా...తమరే గనుక సిఎం సీటులో ఉండి ఉఁటే..అసలు ఇలా ఎందుకు ఉఁటుందండయ్యా...కరోనా కూడా డరో డరో అంటూ పారిపోయేదయ్యా...!



అప్పుడే కథ అయిపోలేదు..నిన్న జగన్ ఏ పాయింట్ ని మధ్యాహ్నం బ్రేక్ చేసాడో..దాన్నే పెద్ద కొలంబస్‌లాగా...పట్టుకుని మాట్లాడటం ఏంటయ్యా చంద్రబాబుగారూ..ఇప్పటికైనా మీరు కనీసం ప్రతిపక్షనేతగానైనా ఏపీకి రండయ్యా...14 రోజులు క్వారంటైన్ లో ఉండి...అమరావతికి వేంచేయండయ్యా..ఎఁదుకంటే మీరు సిఎఁగా లేని ఈ రాష్ట్రంలో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో తెలీదు కదయ్యా..పరామర్శలకు బయలుదేరుదురు...! 

Comments

  1. 40 ఏళ్లు అనుభవం ఉన్న వ్యక్తి ఇంత చవకబారు రాజకీయం చేయడం తన వ్యక్తిత్వానికి అవమానకరం.

    ReplyDelete

Post a Comment