ఎంత విమర్శించకూడదన్నా..ఒక్కోసారి పాలకుల నిర్ణయాలు కడుపు మంట కలిగిస్తుంటాయ్..ఇప్పుడు కరోనాకి సడలింపు అడుగుతున్నారు కదాని ఎకాఎకిన జిల్లా బస్సులకు పర్మిషనిచ్చారు..కానీ మరి సిటీ-హైదరాబాద్‌లో మాత్రం లేదు..పోనీ అసలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా అంటే..ఉంది ఆటోలు క్యాబ్‌లో తిరగవచ్చట..అందులో ఒక్కో ఆటోలో ఇద్దరు మాత్రమే వెళ్లాలట..జరిగే పనేనా ఇది
ఉదాహరణకు చూడండి పంజాగుట్ట నుంచి జూబ్లీచెక్ పోస్ట్ 15-20 షేరింగ్ ఆటో( వాడెక్కించుకునేది ఐదుగురిని)
అలానే అమీర్ పేట టూ ఫిల్మ్ నగర్..20 రూపాయలు..ఎక్కించుకునేది ఆరుగురిని
ఇంకా హౌసింగ్ బోర్డ్ టూ అమీర్ పేట 20 రూపాయలు..ఎక్కించుకునేది ఆరుగురు లేదంటే ఐదుగురు
ఇవే కాకుండా ఇలా సిటీలో అనేక ఏరియాలు ఉన్నాయ్...లింగపల్లి టూ మెహదీపట్నం..మెహదీపట్నం టూ టోలి చౌకి, చార్మినార్ టూ కోఠి..కోఠి టూ ఎంజిబిఎస్..వగైరా వగైరా..ఇన్ని చోట్ల ఇద్దరితోనే ఆటోలు తిరగవు..ఎక్స్ ట్రా డబ్బులు వాయించుకోవాల్సిందే..సరే ఓన్లీ సర్వీస్ ఆటోలే నడుపుతారనుకుందాం..కానీ మరి జిల్లాల నుంచి వచ్చిపడే జనం మాటేంటి..వాళ్లకి అందుబాటులోకి ఆటోలు రావాలంటే..తప్పనిసరిగా ఓవర్ లోడింగ్ జరుగుతుందన్నమాటే కదా..మరెక్కడ సామాజిక దూరం..అసలే సిిటీలో కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే..మధ్యలో ఈ టెన్షనేంటంట..అసలు ఎవడు అడిగాడు..ఈ సర్వీసులను నడపమని.
మీకేం బాబూ ఇలానే అంటారు..జర్నీలు చేయాల్సిందే అంటారా.
..మరి సిటీ సర్వీసులేం పాపం చేసాయో చెప్పగలరా..ఓహో జిల్లాల బస్సులైతే జనాలను కంట్రోల్ చేయగలం కానీ..సిటీ బస్సుల్లో ఎక్కే జనాల సంఖ్యని కంట్రోల్ చేయలేమనా...ఎందుకు చేయలేరు..ఎటూ ఏ రోజూ ఏ స్టాప్ లో కూడా బస్సులు నిలపని సిటీ బస్సు డ్రైవర్లకి లిమిట్ కి మించకుండా పీక్కరావడం మాత్రం తెలీదా..
Comments
Post a Comment