అసలు ఎన్నడూ రాని అవకాశం..మామూలుగా అయితే చంద్రబాబుగారిని కలవాలంటే సిఎంగా ఉన్నప్పుడే కాదు..ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కూడా 2014కి ముందు అంత తేలిక కాదు..వీజీ అసలే కాదు..కానీ 2019 ఎన్నికల్లో కొట్టిన దెబ్బకి బాబుగారే దగ్గరకు లాక్కుని మరీ ఫోటోలకు పోజులిస్తున్నారు...ఇది నిజమా కాదా అని తెలుగు తమ్ముళ్లే తెగ వకరి వళ్లు మరొకరు గిచ్చుకునే రోజులు..కానీ పోయాయ్..ఆ రోజులూ పోయాయ్..ఇప్పుడు అంతా కరోనా సీజన్..
ఇప్పుడు అంతకి మించిన బ్రహ్మాండమైన ఆఫర్ రెండు ఛానళ్లు రెండు పేపర్లు ఆంధ్రజనాలకు ఇచ్చేస్తున్నాయ్..మీ లోకల్ కేబుల్ వాడు కూడా మిమ్మల్ని గుర్తు పట్టకపోవచ్చు...కానీ..ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రిమోట్ నొక్కినా ప్రత్యక్షమమయ్యే శాటిలైట్ ఛానళ్లలోనే ప్రత్యక్షమయ్యమే ఛాన్స్..అందులోనూ మీరేది పడితే అది మాట్లాడొచ్చు..ఎవ్వురూ అడ్డుపడరు..భాష మార్చు గురూ ఘోష..గోస పెట్టరు..
ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పిలుస్తారు..మీకు టిఫినిలు గట్రా కూడా అరెంజ్ చేస్తారు..ఓ రకంగా మీరు మీ చుట్టాలింటికి వెళ్లొచ్చినంత దర్జాగా ఆ పేపరోళ్లు మీకు స్వాగతాలు పలుకుతారు..ఆ చానలోళ్లు మీకు ఆశ్రయమిస్తారు..
ఇఁతకీ మీరు చేయాల్సిందల్లా ఒకటే..గగన్ ని తిట్టడం..విమర్శించడం..ఏ విషయంలోనైనా తడుముకోకుండా..అన్నీ తప్పులే చేస్తున్నాడు..ఏంటీ ప్రభుత్వం చస్..దిగిపోండంటూ వార్నింగులివ్వడం..మధ్యలో మీరెక్కడైనా డ్రాప్ అియినా సదరు ఛానల్ ప్రయోక్తే మీకు హింట్లు కూడా ఇస్తారు..చూసారా ఇలాంటి ఆఫర్ ఎక్కడా దొరకదు..ఇదే సమయం దూకేయండి...
.ఆ..హలో..హలో చెప్పండి వింటున్నానండీ ఏంటీ ప్రభుత్వం తీరు..నాకస్సలు నచ్చలేదు..అదిగో ఆరితేరిపోయారే మీరు..
ఇదే ఇప్పుడు ఆ రెండు ఛానళ్లలో ఊరూ పేరూ లేని సందులో శరభయ్యలు..గొందిలో గురవయ్యల చర్చా ప్రహసనాలు
Comments
Post a Comment