మీకో రూల్...వైఎస్సార్సీపీకి ఓ రూలా...ఏంటి బాబూ ఇది


వచ్చేసారు...సారు వచ్చేసారు..2 నెలలుగా క్వారంటైన్‌లాగా బయటకే రాని చంద్రబాబుగారు ఏపీకి వచ్చేసారు..ఐతే ఇక్కడ సదరు పత్రిక అబిమానం చూడండి..లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఏపికి చంద్రబాబుగారు వచ్చారుట..అంటే ఇన్ని రోజులూ కేవలం ప్రేమ లేక కాదు..సడలింపులు ఇవ్వకే రాలేదని  అనుకోవాలని..కానీ మరి బాబుగారు మాత్రం తనకి పర్మిషన్ ఇవ్వనందునే ఏపీకి వెళ్లడం లేదని గత వారం వాపోయినట్లు గుర్తు..ఆది వదిలేద్దాం..పైనా ఫోటా..కిందా ఫోటోలు మొత్తం సదరు పార్టీని బ్రహ్మాండంగా లేపేందుకు కంకణం కట్టుకున్న చానల్ వే..బ్రహ్మాండంగా బాబుగారికి స్వాగతం పలికారని..గొప్పగా బ్రేకింగులేసుకుని తరించారు..
మరి పైన ఫోటోల్లో ఎక్కడైనా సోషల్ డిస్టెన్సింగ్ ఉందా...కన్పిస్తుందా.....
ఇది రెండు రకాలుగా ప్రమాదం వారిలో ఎవరైనా లక్షణాలు బైటికి కన్పించని బాధితులు ఉంటే వారి ద్వారా ఇతరులకు సంక్రమించడం వకటి..రెండోది..అసలు అధినేతనే ఆ ప్రమాదంలో పడబోవడం



మరి ఏమంత మహాపాపం చేసారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు...హైకోర్టులో తెగ చీవాట్లేసారంటూ సదరు ఛానల్ పత్రికే ఎంత ఆనందం పంచుకుందో చూసారుగా...మరి ఇక్కడ భౌతికదూరాలూ...వ్యక్తిగత నియంత్రణలు అక్కర్లేదా...

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలో రోజా పరిస్థితి మరీ ఘోరం..ఒక్కో మున్సిపల్ వర్కర్ మూ్డు అడుగుల దూరంలో నిలుచుండి..ఓ పక్కగా ఆమెపై పూలు చల్లారు..( సరే మీ భాషలో చల్లించుకున్నారు) తర్వాత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఒక్కో ట్రాక్టర్ లో ఒక్కరు అంటే ఎంత దూరమో చూడండి..పైగా వీళ్లంతా కూడా కడుపుకి ఇంత అన్నం పెట్టారు..సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసారు..అవేమైనా ఘోరమైన పనులా...మరి అవే అంత తప్పైతే..దీన్నేం అనాలి..

పైగా ఓ హీరోగారు అంటారు..అది ప్లాన్ చేసింది కాదు..అనుకోకుండా జరిగిందని...ఏవండీ..ఏవన్నా అంటే అన్నామంటారు కానీ...ప్లాన్ చేయకపోతే కూడా ప్లకార్డులు రెడీ అయిపోతాయా...ఫోటోలు వాటంతట అవే ప్రింటై పోతాయా...అంతేలేండి మీరు చే సేదే...డ్యాష్...అవతలివాళ్లు చేసేది..డ్యాష్..ఇలా చేయబట్టే కదా...ఎన్నికలలలో అలా వాత పెట్టింది


Comments

  1. రెండు నెలలు అజ్ఞాతవాసం చేసి ఇంటికి వస్తే అస్మదీయ భజన బృందానికి పండగ. పచ్చ చానెల్లకు పూనకాలు.
    పచ్చ పచ్చగా ఉన్నది. స్వర్గ మిక్కడే ఉన్నది.
    కలువకు చంద్రుడు ఎంతో దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం

    నిన్న నీవు నాకెంతో దూరం. దూరం దూరం. నీవు నాకు ఈనాడు ప్రాణం ప్రాణం పాటలు వినిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment