మహానాడులో జగన్ పాట ఎందుకంట..పార్టీ సంగతి వదిలేసి..బాలయ్య కామెంట్లు మరీ విడ్డూరం


జగన్ అలాంటోడు..ఇలాంటోడు..అలా చేసాడు..ఇలా చేశాడు..జూమ్ లో మెగా మహానాడు సాగుతోన్న తీరిది..
ఆయనలా చేసాడు.మనం ఇలా చేసామని ఆత్మస్తుతి పరనింద తప్ప ఏదైనా పార్టీకి పనికి వచ్చే పనేదైనా చేసారా..ఈ కరోనా కాలంలో కనీసం పార్టీ కేడర్‌ని ఆదుకునేందుకు ఏవైనా ఆర్థిక సాయం ప్రకటించడం..లేదంటే కార్యకర్తలకు హెల్త్ ఇన్సూరెన్స్ ( గతంలో చేసామని చెప్పింది) పై డీటైల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివేమైనా ఉంటే...కింద స్థాయి కార్యకర్తలకు కాస్త ఊరటగా ఉంటుంది...ఎందుకంటే టిడిపి నడిచేదే కార్యకర్తలపై అంటూ రొడ్డ కొట్టుడు డైలాగులు కొడుతుంటారుగా మాజీ మంత్రులు..ఎమ్మెల్యేలు...అందుకన్న మాట

మహానాడు కొత్తగా ఉత్సాహంగా అంటూ హెడ్డింగులు పెట్టుకున్నంత మాత్రాన అదే వాస్తవమైపోదు..ఎన్నికలకు ఇంకో నాలుగేళ్లు ఉన్నాయ్..అందులో ఇంకో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారంటున్నారు..ఇలాంటి సమయంలో..అందులో కొత్తగా జరగడానికి ఏం ఉంది..అలానే ఉత్సాహంగా పాల్గొనడానికి ఇదేమైనా ఇదివరకటి కాలమా...కరోనా సీజన్...ఏ  పార్టీ కార్యక్రమం అయినా ఏడవలేక నవ్వుతున్నట్లు సాగుతుంటే...మహానాడు మాత్రం బ్రహ్మాండంగా సాగిందంటూ చెప్పుకోవడం జాలి కలిగిస్తోంది..

 నిజంగా అందులో పాల్గొన్న లీడర్లలో కాస్త ఉత్సాహం ఏదైానా ఉందంటే కాస్త మందలగిరి హీరో స్లిమ్ ( కాస్తే) అవడం తప్ప..ఎక్కడ జూమ్ తరహా మీటింగ్స్‌లో జోష్ ఉండే ఛాన్సేదీ..పైగా జూమ్ ని వాడమాకండ్రా సామీ అని అంటుంటే దానికే ఓటేస్తామంటే చెప్పేదెవరు..

ఇక నందమూరి నటతిలకం బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారో  ఆయనకేమైనా స్ప) హ ఉందా అనే అనుమానం రాకతప్పదు..రాయలసీమ ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలు..ఎన్టీఆర్ కలలను చంద్రబాబు నెరవేర్చుతున్నారు..ఏంటీ డైలాగులు ఛీ దీనెమ్మ జీవితం అన్పించదా..పదవి లోంచి దించేసి...సీఎం సీటు లాగేసుకున్నోడు ఎన్టీఆర్ కలలను నెరవేర్చుతున్నాడా...అస్సలు సిగ్గుండే మాటలేనా..ఇవి..అందుకే మహానాడు అంటే అది ఎన్టీఆర్ ఆత్మ ప్రతిసారీ దడుచుకుంటుందేమో..ఇలా మర్డర్ చేసినోడే పిండం పెట్టి అన్నదానం చేసినట్లు వ్యవహరిస్తుంటారు కాబట్టే..పార్టీ సిచ్యుయేషన్ ఇలా తయారైంది..ఇదేదో యాంటీ టిడిపి జనాల మాట కాదు..పార్టీ పుట్టకముందు నుంచి ఎన్టీఆర్ ని ఫాలో అయి..పెట్టినాక పార్టీని పెంచి పెద్ద చేసి..చివరకు అందులోంచి బైటికి నెట్టివేయబడిన..పార్టీకి దూరంగా ఉండిపోయిన లక్షలాదిమంది కార్యకర్తల నిజమైన ఫీలింగ్.


Comments

  1. మహా గోడు కోసం ఒక పాట.

    ఎందుకయా చంద్రమయా ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా.

    ఈ చిల్లర మాటలు ఈ అల్లరి చేతలు ఎందుకయా చంద్రమయా.

    అన్నగారి ఆత్మ కు శాంతి లేకుండా చేస్తున్నాయి.

    ReplyDelete
  2. పోనీలెండి "సారే జహాసే ఘటియా బుల్బుల్ పార్టీ హమారా" అనే పాట పాడలేదు!

    ReplyDelete

Post a Comment