సినీ నటి కుమారుడట...ఎవరితను..పాపం ఇలా చేయడం తప్పే కదా


కరోడా కరోనాకి వాళ్లేంటి వీళ్లేంటి ఎవరైనా పడుకోవాల్సిందే..ఐతే వీలైనంత తొందరగా కోలుకునేట్లు చేయడమే డాక్టర్లు చేస్తోంది..అలానే జనం కూడా జాగ్రత్తగా ఉండటం తప్ప చేయగలిగిందేం లేదు..మనం పో అంటే పోవడానికి అదేం కుక్క కాదు కదా..ఇలాంటి సమయంలోనే సెలబ్రెటీలు..లేదు అందరికీ తెలిసినవాళ్లకి అది సోకిందంటే అదో తుత్తర
అందరికీ చెప్పాలి...కానీ అలా చెప్పకూడదు..


కాస్తో కూస్తో..సంయమనం పాటించాలి..కానీ ఇలా ఏరియా పేరు చెప్పి..క్లూ ఇస్తేనే కదా..ఇక జనం వాళ్ల మైండ్కి మేత పెట్టేది..అసలు ఎవరా నటి...ఆమె కొడుకు అంటున్నారంటే బహశా అతను ఫీల్డ్ లో లేడు..ఇలా ఎవరి ఊహాగానాలకు త్గగట్లు వాళ్లు క్లూలు వెతుక్తుంటూ పోవడం..ఇంకొద్దిగా అతిగాళ్లు యూట్యూబ్ స్టోరీలు కూడా అల్లేస్తారేమో..
ఇలా చేయకూడదు కదా..తెలిసినా సరే చెప్పొద్దు..ఎందుకంటే..రోగాన్ని కాకుండా రోగినే వెలేస్తున్న సమాజం ఇది..అందుకే ఈ దాపరికం

Comments