ఊళ్లో పెళ్లిళ్లకి మాధవీలత హడావుడి..గుర్తింపు కోసం తపనా..తనకి కాలేదనా..?


ఏది పడితే అది మాట్లాడటం నిర్మొహమాటం అనిపించుకోదు..వెర్రితనం..ఇంకా మాట్లాడితే..పనిలేని మంగలోడు పిలిచి మరీ గొరిగినట్లు తయారవుద్ది..కరోనా వచ్చినంతమాత్రాన జనాలు అన్నీ మానేసుకుని కూర్చుంటారా..అలా సాధ్యమవుతుందా..? అందుకే ఎవరికి నచ్చిన పనులు ఇతరులకు ఇబ్బందులు కలగని రీతిలో చేసుకుంటున్నారు..దానికి ఆక్షేపణలు తెలపడం..ఐడెంటిటీ క్రైసిస్సే అనుకోవాలి

నిఖిల్..వెంకటరమణారెడ్డి ఉరఫ్ దిల్ రాజు..గత వారంలో పెళ్లి చేసుకున్నారు..వాళ్ల వ్యక్తిగత విషయం పైగా..లాక్‌డౌన్‌కి తగ్గట్లుగానే కొద్దిమందితోనే చేసుకున్నారు..దానిపై అర్జంట్‌గా స్పందించాల్సినంత అవసరం ఏముంది..పైగా తమకి సంబంధంలేని వ్యక్తులపై నాలుగు విమర్శలు చేయగానే మాట్లాడుకుంటారనే తపన తప్ప

సదరు మాధవీలత కామెంట్లు చూస్తే..అక్కసు వెళ్లగక్కడం తప్ప ఏం కన్పిస్తుంది..ఏం కొద్ది రోజులు ఆగలేరా..మనుషులేం మారరుగా..ఎందుకిలా చేసుకోవాలి...అంటూ తన మేధావితనం ప్రదర్శించడమే తప్ప..అవతలివారి జీవితంపై కామెంట్లు చేయకూడదనే ఇంగితం నశిస్తే ఎలా...అక్కడికి తనకేదో జీవితంపై తెగ అనుభవం ఉన్నట్లు...ఇంకో మిత్రుడి కామెంట్ ఏంటంటే..ఈమెగారికి పెళ్లయ్యేది లేదు..అందుకే ఇతరులపై పడి ఏడుస్తుంది అంటాడు..వాక్ స్వాతంత్రం మరి..ఎవరు ఏదైనా మాట్లాడొచ్చని మాధవీలత అంటే..ఇలా మాట్లాడేవాళ్ల కామెంట్లకి కూడా వేల్యూ ఇవ్వాలి మరి...
పైగా నా పోస్ట్ నా ఇష్టం అని పెట్టుకుంది..తర్వాత అదసలు నా పోస్టే కాదనవచ్చు..మాకూ రైట్స్ ఉన్నాయ్ కాబట్టీ మా ఇష్టం వచ్చినట్లు మేం కూడా ఊహించుకుంటాం మరి..నువ్వంటే పెళ్లి లేకపోయినా..ఆగగలవ్..మరి వాళ్లు ఆగలేకపోతున్నారు సరేనా..

Comments