జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజై..ముఫ్పై ఏళ్లు...ఆ తర్వాత యాబై ఏళ్లు..వందేళ్లు కూడా గడుస్తాయ్..అది కాదు విషయం..ఈ సినిమా నిజంగానే రాఘవేంద్రరావ్...అశ్వనీదత్‌ల మానసపుత్రికేనా..అంటే..కాదని అంటాం..
ఎందుకంటే..ఇదే కథాంశంతో లేదంటే కథావస్తువుతో..హిందీలో 1987లో మిస్టర్ ఇండియా అనే సినిమా వచ్చింది..
సూపర్ హిట్టైంది..శేఖర్ కపూర్ డైరక్ట్ చేశాడీ మూవీని..ఈ సినిమాకి హీరోయిన్గా నటించినందుకు శ్రీదేవికి 11లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారంటారు..అదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఓ లేడీ ఆర్టిస్ట్‌కి అప్పట్లో అంటారు మరి..
ఇందులోని హీరో అనిల్ కపూర్ ఓ నలుగురు పిల్లలను చేరదీసి తన పెద్ద భవంతిలో బతుకుతుంటాడు..కానీ రోజూ భుక్తి కోసం ఏదో పని చేసుకుంటే కానీ బండి నడవని సిచ్యుయేషన్..హీరోయిన్ శ్రీదేవి ఓ జర్నలిస్ట్ ..హీరో బిల్డింగ్‌లో ఓ గదిలో రెంట్ కోసం వచ్చి ఇతన్ని ప్రేమిస్తుంది. కథలో విలన్..ముగాంబో..ఈ క్యారెక్టర్ చేసింది అమ్రిష్ పురి..కథలో హీరోకి ఓ రోజు ఓ లెటర్ వస్తుంది..తండ్రి గొప్ప సైంటిస్ట్ అని..అతను కనిపెట్టిన ఓ గోల్డ్ వాచ్ కనుక పెట్టుకుంటే అదృశ్యమయిపోయే శక్తి వస్తుంది దాన్ని స్వాధీనం చేసుకోమని ఉంటుంది ఆ లెటర్లో అలా అనిల్ కపూర్ ఓ మాయా వాచీని స్వాధీనం చేసుకుంటాడు..హీరోయిన్ శ్రీదేవిని రౌడీ గ్యాంగ్ నుంచి కాపాడతాడు..ఈ క్రమంలో తన పేరు బయటపెట్టకుండా..మిస్టర్ ఇండియాగా చెప్తాడు..అలా మిస్టర్ ఇండియా తనకి తెలీకుండానే విలన్ ముగాంబోతో తలపడతాడు..ముగాంబో ఖుష్ నై హోతా..అంటే ఇందులో ఫేమస్ డైలాగ్ అది..ముగాంబో ఖుష్ హువా అనేది..హీరో విలన్ని తనకి ఉన్న అదృశ్యశక్తులతో ఎలా అంతం చేసాడనేది మిగిలిన కథ..
ఇక ఇందులోనుంచి స్ఫూర్తే పొందారో..లేక ఇమాజినేషన్తోనో కానీ మూడేళ్లకి తెలుగులో కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి రూపంలో వచ్చింది..ఇందులో కూడా హీరోయిన్ శ్రీదేవి..విలన్ అమ్రీష్ పురినే.. హీరో చిరంజీవి అనాధపిల్లలతో గైడ్‌గా కాలక్షేపం చేస్తుంటాడు..ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఇంద్రజ..ఉంగరం లేకుండా అక్కడకు తిరిగివెళ్లలేదు..అది దొరికిన చిరంజీవి..దాని శక్తి గుర్తించకుండానే విలన్లతో గొడవ పడుతుంటాడు..పెద్ద విలన్ అమ్రీష్ పురి మాత్రం మాయలు చేస్తూ..లోకాన్ని ఏలదామనే ఆశతో ఉంటాడు..అచ్చంగా ముగాంబోలాగానే..
రైటర్ యండమూరి వీరేంద్రనాధ్..నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావ్ కలిసి మిస్టర్ ఇండియాని బాగా చిత్రిక పట్టేసి..మనకి గతంలో వచ్చిన జగదేకవీరుని కథలోని కొంత భాగం కలిపి..మొత్తానికి ఓ మంచి విజువల్ ఫీస్ట్ సినిమాని అందించారు..ఇళయరాజా మ్యూజిక్‌లో వచ్చిన పాటలకు..చిరంజీవి శ్రీదేవి సూపర్ స్టార్లైన తర్వాత మొదటిసారి కలిసి నటించిన సినిమా కావడం..వైజయంతీ మూవీస్ భారీతనం అన్నీ కలిసి సినిమాని ఆడియన్స్ ఎక్కడకో తీసుకెళ్లారు. ఇప్పడు మనం చెప్పుకున్న విషయాలేం కొత్తవి కాదు. చాలామందికి తెలిసినవే..
.వాస్తవానికి రాఘవేంద్రరావ్ ఇలా హిందీ సినిమాలను తెలుగులోకి ఫ్రీమేక్ చేయడం కొత్తేం కాదు..దీని తర్వాత కూడా సాజన్ అనే సూపర్ హిట్ మూవీని తెలుగులో కాస్త అటూ ఇటూ మార్చేసి అల్లరిప్రియుడిగా మార్చేసి హిట్ కొట్టాడు..ఇలాంటి సిత్రాలు ఇంకా చాలా ముందు ముందు చెప్పుకుందాం..
సువర్ణ సుందరి + మిస్టర్ ఇండియా = జగదేకవీరుడు అతిలోక సుందరి
ReplyDelete