కొందరుంటారు..ఎందులోనైనా తమకి అనుకూలమైన కోణాన్ని (ఉందనుకుంటూ) వెతుక్కుని జనాల కళ్లకి వెలుగు పంచే మార్గదర్శులు ఆ కోవలో ప్రథమంగా తామే ఉండాలని..ఉంటామని టిడిపి అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు ఊదరగొడుతుంటారు..ప్రతి సంక్షోభం తమకిఅవకాశమేనంటారు..బహుశా ఆయన దీవెనలతోనే ఈ దిశగా కొత్త పలుకులు ఉద్భవించాయనుకోవాలి..
లేకపోతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు లేదంటే రిజర్వాయర్..అదీ కాదంటే ఓ చిన్న పిల్లకాలువ వలన నష్టమే లేకపోతే..వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దానిపై ఎందుకు అంత గొడవ జరిగింది..సరే నిజంగా రాజకీయ మైలైజీ కోసమే గొడవ జరిగిందనుకుందాం..మరి పారుతున్న నీళ్లు కూడా ఊరికే పారుతున్నాయా...అదంతా నిజం కాదా..ఇది గతం..వర్తమానంలో రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు
అప్పటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రిగారు మాజీ అయ్యారు..ఆయన పుత్రరత్నం మాత్రం ఏదీ అవలేదు..కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచేందుకు జీఓ ఇష్యూ చేసారనే ఇష్యూ అవుతోంది కదా..ఇదేదో అర్జంట్‌గా ఏపీలో సిఎంకి ఇమేజీ పెరిగే కార్యక్రమంగా అన్పించిందో ఏమో..కానీ వెంటనే సంక్షోభాల్లో అవకాశం కోసం తపన ప్రారంభమైంది..
ఏయ్..ఏంటది..అసలు అక్కడ వరద వచ్చేదెప్పుడు..నీళ్లు పారేదెప్పుడు..దాంతో ప్రయోజనం ఏంది..ఎన్ని నీళ్లు తీసుకుపోతాడు జగన్ ఎంత లాగినా మహా అయితే ఓ 37 టిఎంసిలు అంతేగా..అవైనా ఎక్కడ దాచి పెడతాడు..అసలు ఇంతకంటే గొప్పగా మాగొప్పగా మా చంద్రబాబు మచ్చుమర్రి అనే వరప్రదాయిని కడితే మీరేమో..ఓడించేస్తిరి...లేకపోతే..శ్రీశైలం డ్యామ్ నుంచి 810 అడుగుల దగ్గర్నుంచైనా..నీరు తీసుకుపోవచ్చు తెలుసా
అంటూ హూంకరింపులు..సరే ఏం చేసినా చంద్రబాబుగారే చేయాలి కాబట్టి ఓకే..మరిప్పుడు జగన్ ఇచ్చిన జీఓతో శ్రీశైలం డ్యామ్ దగ్గర 800 అడుగుల కి నీటి మట్టం ఉన్నా కూడా నీళ్లు తీసుకుపోవచ్చు కదా(ఇక్కడే ఓ లిఫ్ట్ కట్టడానికే ఏపీ ప్రభుత్వం తయారవుతోంది)...810 అడుగుల దగ్గర తీసుకుపోతేనేమో బ్రహ్మాండంగా దాచి పెట్టుకోవడానికి
రిజర్వాయర్లు ఉన్నాయా...800అడుగుల దగ్గర తీసుకుపోయే నీటికేమో అసలు వసతే లేదా..శభాష్..ఇలా చేయడం వలన తెలంగాణకి ఏ మాత్రం నష్టం లేదా..సూపర్..
అయ్యా తెలంగాణ నేతలూ విన్నారు కదా..పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు నష్టం లేదు..కాబట్టి ఇక మీరు సైలెంటైపోండి...రెండు రాష్ట్రాల మధ్య తగాదా నెలకొనాల్సిన అవసరం లేదు..సో ఈ వ్యూహంతో జగన్ ఇమేజేకి డ్యామేజీ చేసారనుకుందాం..మరి కేసీఆర్‌కి కూడా హెల్ప్ చేసినట్లేగా..సూపర్..భలే..మంచి పని చేసారు..ఎటూ సీమకి కూడా నీళ్లు వెళ్తాయ్...( ఏ...పోవు..అవసలు నీళ్లే కాదనుకోండి..) మంచిది ఏ గొడవా లేకుండా అసలు పని జరగడమే కావాల్సింది..ఇందులో రాజకీయాలెందుకు ...మంచి కొత్తపలుకు..పలుకు..

Comments
Post a Comment