ఆ ఛానల్ పై దాడి చేసారా...? ఎవరంత సాహసం చేసింది...?

( ఇది నిజం ఫోటో కాదు)
మొన్నా మధ్యన..మా సునృత ముత్తుని ఎవరో ఏదో చేయబోతున్నారంటూ హడావుడి చేశాం..ఐనా మన రేటింగ్ అలానే ఆధ్వాన్నంగా ఏడ్చింది..ఎవడూ పట్టించుకోలేదు..పైగా స్వయంగా మనకి మనమే కేసుల్లేవ్ ఏం లేవ్ నాపై ఎవడూ కేసుల్లేవని ప్రకటించుకోవాల్సి వచ్చింది..రెండు రోజులు చాలా ధైర్యంగా ఎవరికి కనబడకుండా..లీగల్ ప్రయత్నాలు చేసుకున్నాని చెప్పుకోవాల్సి వచ్చింది...మరిప్పుడేం చేయాలి...ఆ...మన గుగ్గురువ్ ఒకడున్నాడు..అదే పనిగా నేషన్ వాంట్స్ టూ నౌ అంటూ జులపాలు విదిలిస్తూ..ఎర్రికేకలేస్తుంటాడు...వాడిలాగా మనం ఓ సెటప్ చేద్దాం అనుకున్నారో..ఏందో మరి..

పొద్దున చూసేసరికి..వాయ్యో...మా మీద బండలేసారు...వామ్మా మా మీద బండలేశారంటూ ఒకటే వాపోత..వచ్చిన పతివాడినీ పట్టుకుని..సార్ మీరేమంటారు...మీరే మంటారు...మంటారు..అంటూ పట్టుకుని వాగిస్తే..తప్పక మొహమాటం కొద్దీ( ఎక్కడ లైవ్ కట్ చే స్తారో అని) ఇది శానా దుర్మార్గం అని ఖండించడం...

సామీ ఏందీ యేశాలు...తట్టుకోలేకపోతన్నాం..పైగా ఇదంతా...రెడీగా చేసి పెట్టుకున్న ప్లాన్‌లాగా రెక్కీ సేసారు మామీద అని ఏడవడం...ఏందబ్బా ఇది..అసలు మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటున్నారిప్పుడు...మీ దారిలో ఎవడూ అడ్డం రాడు..రాకూడదు గందా...అందుకే ఎవడి మానాన వాడు ఏ అతిలోకవీరుడు మతిలేని సుందరో మరోటో చూస్కుంటా ఎంజాయ్ సేస్తంటే మళ్లీ మీ పై దండయాత్రలను కూడా సూస్తామా

అదిగో తంతున్నారు..పుచ్చ పగలగొట్టబోతున్నారు అంటే పదిమందికి తెలిసేలా తన్నరులే అనే ప్లాన్లలాగా..మా మీద దాడి సేసారు..ఇరగదీశారు అంటే ఎవడూ పట్టించోకడనా...అసలే ఈ దిక్కుమాలిన సిటీలో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎవడిపై రాళ్లేత్తారో తెలీదు..అంతెందుకు మన ఉజ్జోగస్తుడిపైనే రెండేళ్ల క్రితం ఇట్టానే పోరంబోకులు రీజనేం లేకుండానే తలపగలగొట్టిపోయారు..అప్పట్లో ఏమైనా రెస్పాండయ్యామా..ఇదీ అంతే..ఎవుడో రాళ్లేత్తే..దానికి ఎవుడినో బాధ్యత తీసుకోవాలంటే కుదురద్దా...పైగా...మనకి మనమే ఏదో సేసుకుని..మన నెత్తి పగలకొట్టారని ఏడుస్తున్నారని..ఇప్పటికే అందరూ తెగ నవ్వేసుకుంటన్ారు...అదే నిజమైతేనా నా సామిరంగా...
జరగాల్సిందే ఎంక్వైరీ..వదలకూడదు..నిజంగానే...దర్యాప్తు జరగాల్సిందే...అప్పుడు తేలుద్ది..అసలు బండలు మోసిన మొనగాళ్లెవరో

Comments

  1. సినిమా ఆడోళ్ళ గురించి సాంబడి బూతులు, మమ్మల్ని దుష్ట దుర్మార్గ కిరస్థానపు జగన్ బాన్ చేసాడని దొంగ ఏడుపులు, సింగర్ స్మిత తిక్క నత్తి ఏషాలు, కుండబద్దలోడి వికృత వికారాలు, భ్రమరావతి అంటూ లొల్లి మీద లొల్లి, ఇదుగో మూర్తి అరెస్టన్తి అడ్డగోలు ట్విట్టరులో పుకార్లు.

    ఏమి చేసినా రేటింగులు రావడం లేదు ఎట్ల చచ్చేది.

    ReplyDelete
  2. టీవీ5 మీద ఎవరు దాడి చేసారో లేదో కానీ చానెలోడు మాత్రం విశాఖపట్నం మీద మళ్ళా దాడి మొదలెట్టాడు.
    బూతు సాంబడు తన డైలీ చంచాలను పోగేసుకొని నగరం మీద విషం కక్కడం షురూ.

    ReplyDelete

Post a Comment