పదిహేను అంశాలపై రోజు వారీగా ఇరవైలక్షలకోట్ల మేర ప్యాకేజీ ఉంటుందని ప్రకటించారు ప్రధాని..దానికి తగ్గట్లుగానే కేంద్రఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వరసగా ప్రెస్‌మీట్లతో హోరెత్తించారు..ఇరవైలక్షలకోట్ల రూపాయలకు కూడా కేటాయింపులను సర్దేశారు..అంతా ముగిసింది..చివరకి చూస్తే మార్చి నుంచి ఇప్పటిదాకా..డబ్బు రూపంలో అందించింది మాత్రం 61వేలకోట్లు మాత్రమే..అంటే మరి మిగిలిన 19లక్షలకోట్ల పై చిలుకు ధనమంతా ఎలా సర్దేసారంటారా కింద చూడండి..ఆ అంకెల గమ్మత్తు ఏంటో అర్ధమైపోతుంది
కేంద్రం ప్రకటించిన 20లక్షలకోట్ల రూపాయల ప్యాకేజీలో తొలివిడతగానే తాము అందించిన ప్రోత్సాహకాలు..రాయితీలు, మినహాయింపులతో 5లక్షల94వేల550కోట్లు వ్యవస్థలో సమకూరినట్లు చెప్తోంది..వాటిని విడివిడిగా చూస్తే..వ్యాపారాలకు, మైక్రో,స్మాల్ అండ్ మిడ్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలకు ఎమర్జెన్సీ వర్కింగ్ కేపిటల్ రుణాలకు రూ.3లక్షలకోట్లు కేటాయించింది. అలానే చితికిపోయిన ఎంఎస్ఎంఈలకు సబార్డినేట్ డెట్ కింద మరో 20వేలకోట్లు..ఎంఎస్ఎంఈల ఫండ్ కోసం మరో 50వేలకోట్ల రూపాయల ఫండ్ ఆఫ్ ఫండ్స్
కేటాయించగా..అక్కడితోనే మూడున్నరలక్షలకోట్లు పూర్తయ్యాయ్.ఇక ఈపిఎఫ్ చెల్లింపులతో ప్రభుత్వంపై పడే భారం రూ.2800కోట్లు..ఈపిఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు కింద రూ.6750కోట్లని లెక్కగట్టింది కేంద్రం. వీటితోపాటే ఎన్‌బిఎఫ్‌సిలు..హౌసింగ్ కార్పోరేషన్లు.. మైక్రో ఫైనాన్స్ కంపెనీలకోసం 30వేలకోట్లు
ఎన్‌బిఎఫ్‌సిల పార్షియల్ క్రెడిట్ గ్యారంటీకింద మరో 45వేలకోట్లు కేటాయించింది..విద్యుత్ డిస్కంలకు 90వేలకోట్లరూపాయలు, టిడిఎస్ రేటు మినహాయింపు
50వేలకోట్లతో కలిపి..మొత్తం ఐదులక్షల94వేల550 కోట్లకు బుధవారం ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం..ఐతేఇందులో నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపుల రూపంలో భారం పడేది ఒక్క పిఎఫ్ చెల్లింపు మాత్రమే అంటే కేవలం 2800కోట్లు మాత్రమే. ఇది కాకుండా..ఎంఎస్ఎంఈల సబార్డినేట్ డెట్ ఫండ్ 20వేలకోట్లులో 20శాతం భారం కూడా పడేటట్లైతే..మొత్తంగా ఖజానాపై 6,800కోట్లు మాత్రమే భారం పడుతుంది..
సెకండ్ ట్రెంచ్ చూస్తే..మూడులక్షల10వేలకోట్లరూపాయల విలువైన ప్యాకేజీకి ఇది సమానమని కేంద్రం చెప్తోంది..ఇందులో రెండు నెలలపాటు పేదలకు..వలసపనివార్లకు ఆహార పంపిణీని కూడా ధనం రూపంలో లెక్క గట్టింది..మైగ్రెంట్ వర్కర్కకు రెండునెలలపాటు ఉచితంగా ఆహారం పంపిణీకి రూ.3500కోట్ల పద్దు రాసింది. ముద్ర శిశు రుణాల ఇంట్రెస్ట్ మినహాయింపు కోసం 1500కోట్లు..స్ట్రీట్ వెండర్ల అంటే వీధుల్లో వ్యాపారం చేసేవాళ్లకు
5వేలకోట్లు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల గృహనిర్మాణ రాయితీలకు 70వేలకోట్లు లెక్క చెప్పింది కేంద్రం..నాబార్డు ద్వారా అందించే 30వేలకోట్ల రుణాలు రైతులకు కిసాన్ క్రెడిట్ ద్వారా అందించబోయే 2లక్షలకోట్ల రుణాలను కూడా కలిపితే మొత్తం మూడులక్షల10వేలకోట్లరూపాయల మేర రెండో విడత ప్యాకేజీని
ప్రకటించారు..ఇందులో కూడా ధనరూపేణా సాయం లేదు..ప్రభుత్వంపై భారమనేదే లేదు..ఇదంతా రాబోయే కాలంలో ఇంత మేర రుణ సౌకర్యమే తప్ప..తక్షణ ధనసాయం లేని ప్యాకేజీగా చూడాలి..లేదూ ప్రభుత్వమే స్ట్రీట్ వెండర్ల అప్పు, ముద్ర శిశురుణాల వడ్డీ కలిపి కట్టే టట్లైతే..రూ.6500కోట్లమేర భారం ప్రభుత్వంపై పడినట్లుగా భావించాలి
మూడో ట్రెంచ్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి 20వేలకోట్లు..మైక్రో ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలకు పదివేలకోట్ల రూపాయలు ఫండ్‌తో పాటు యానిమల్ హజ్జెండరీ,,తేనేగూళ్ల పెంపకం..ఔషద మొక్కల సాగు ప్రోత్సాహం కింద మరో 20వేలకోట్లు కేటాయించారు.. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పన కోసం లక్షకోట్లతో అగ్రిఇన్ఫ్రా ఫండ్ ప్రకటించారు..అలా మూడో విడతలో లక్షాయాభైవేలకోట్లరూపాయల మేర కేటాయింపులు బడ్జెట్‌లో ప్రకటించినట్లు చెప్పారే తప్ప..వాస్తవంగా రైతులకు ఆయావర్గాలకు తక్షణం ఉపశమనం పొందేలా రుణాల రద్దు కానీ..చెల్లింపులను రద్దు చేయడం సంగతి కానీ చూడలేదు..
చివరి నాలుగు ఐదు ప్యాకేజీల ప్రకటనలు చూసినా..మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 40వేలకోట్లు..వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద మరో 8100కోట్లు కేటాయించారు..ఇక్కడితోనే 20లక్షల కోట్లరూపాయల ప్యాకేజీ పూర్తైనట్లు చెప్పేశారు..ఎందుకంటే..ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు కానీ
బ్యాంకుల సిఆర్ఆర్ తగ్గింపు ప్రకటనలను కూడా కేంద్రం ఈ భారీ ప్యాకేజీలో కలిపేసింది..వాస్తవానికి కరోనా వైరస్ కల్లోలం ప్రారంభమైన తర్వాత మార్చి 25నుంచి లాక్‌డౌన్ అమలైంది..అప్పట్నుంచే ఉపాధి కోల్పోవడం ప్రారంభమైంది..కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపులను కూడా ఈ నిర్భర్ ప్యాకేజీలో కలపడమే అన్యాయం..మార్చి 27న కేంద్రం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజీ లక్షా 92వేలకోట్లుగా ఆర్థికమంత్రి ఇప్పుడు చెప్తున్నారు..అలానే ఆర్బీఐ తీసుకున్న చర్యలతో మార్కెట్లోకి రూ.8లక్షల ఒకవెయ్యి603కోట్లరూపాయలు వచ్చిపడ్డాయంటారు..అలా అన్ని రకాలుగా..ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ..రూ.20లక్షల97వేల53కోట్లుగా తేల్చారు..కానీ చేదు నిజం ఏమిటంటే..ప్రభుత్వం నేరుగా ధనం రూపంలో పేదల ఖాతాల్లోకి చెల్లించింది మాత్రం రూ.61,380కోట్లు మాత్రమే...మార్చి 27 నాటి ప్యాకేజీనే జిడిపిలో అరశాతానికి అటూ ఇటూ అయితే..అందులో 61వేల కోట్లంటే..పావుశాతం కూడా లేదు..ఇదే అంకెల గారడీ అంటే..అందుకే ప్యాకేజీల ప్రకటనపై ఏ రంగం కూడా పూర్తి సంతృప్తిగా లేదు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ అయితే..కనీసం రెండు నెలల వేతనాలను అయినా ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశతో ఉండగా..ఇలా రుణాల జాతరకి తెరలేపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఇక రియల్ఎస్టేట్..టూరిజం, హాస్పిటాలిటీ, టెక్స్‌టైల్స్, ఆటో సెక్టార్ లాంటి అనేక రంగాలు కూడా ఇదేరకమైన నైరాశ్యంలో ఉన్నాయ్..
Comments
Post a Comment