ఇదిగో మేం చాలా సేఫ్..కావాలంటే మా దేశానికి రండి..ఆస్ట్రేలియా ఓపెన్ ఛాలెంజ్



ప్రపంచంలో ఇప్పుడు సేఫ్ ప్లేస్ ఏది.
.కరోనా నీడ పడని ప్రదేశమేది అంటే ఎక్కడా లేదనే చెప్పాలి..
కానీ ఆస్ట్రేలియా మాత్రం మా దేశం పూర్తిగా సురక్షితమంటోంది...కరోనాని పూర్తిగా కట్టడి చేశామని ప్రకటిస్తోంది..నెలరోజుల్లోనే వైరస్‌ని కంట్రోల్ చేశామని దానికి తక్కువగా నమోదవుతున్న కేసులే నిదర్శనమంటోంది.

కరోనాతో నెలక్రితం వరకూ బాగా అల్లాడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది..మెల్లగా ఆంక్షలు సడలించడం ప్రారంభమైంది..బీచ్‌లలో పిల్లాపెద్దల సందడి కూడా  చూడొచ్చు..ఈ సీన్లన్నీ చూస్తే..ఓ వైపు కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే..వీళ్లకి మాత్రం హ్యాపీగా ఉండటం ఎలా సాధ్యమైందబ్బా అన్పించకమానదు.

లాక్‌డౌన్ అమలవుతున్న ఆస్ట్రేలియాలో ఇప్పుడక్కడి ..సౌత్ ఆస్ట్రేలియాలో అసలు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని..క్వీన్‌లాండ్‌లో కూడా వారం రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని స్కాట్ మారిసన్ చెప్తున్నాడు..అఁదుకే ఆస్ట్రేలియాలో కరోనా గురించిన ఆలోచనని వైద్యసిబ్బందికి వదిలిపెట్టి..ఎకానమీ రివైవల్‌పై వ్యూహాలు రచించడం ప్రారంభమైంది

నిజానికి ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి 1నే వైరస్ కేసుల ప్రభావంతో చైనా నుంచి వచ్చేవారికి నో ఎంట్రీ బోర్డులు పెట్టారు..చైనా నుంచి ఇతరదేశాలకు వైరస్ వ్యాప్తి కావడం మొదలవగానే..సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ దేశాలకు కూడా సరిహద్దులు మూసేసింది ఆస్ట్రేలియా.. మిగిలిన దేశాలకు మార్చి 19న తమ దేశపు రాకపోకలను నిషేధించింది..ఐతే ఇక్కడే రూబీ ప్రిన్సెస్ షిప్‌లోని 2500మంది ప్రయాణీకులను అనుమతించడం ద్వారా ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది.. ఏబీసీ న్యూస్ కథనం ప్రకారం దాంతోనే దేశంలో 600మందికి కరోనా సోకగా..15మంది చనిపోయారు..మార్చి 22న క్లబ్స్, సినిమాస్, జిమ్ములు..ప్రార్థనామందిరానలు మూసివేసారు..కానీ రెస్టారెంట్లను..సూపర్ మార్కెట్లు, బ్యూటీసెలూన్లు, క్లాత్ స్టోర్లు మెడికల్ షాప్స్ మాత్రం ఓపెన్‌గానే ఉంచింది ఆస్ట్రేలియా..కంప్లీట్ లౌక్‌డౌన్ మాత్రం విధించలేదు..ప్రజలను పెద్ద సంఖ్యలో బయట గుమికూడకుండా చేయగలిగింది..ఇద్దరి కంటే ఎక్కువమందిని కలవకుండా చేసింది..ఐతే ఈ పాక్షిక లాక్‌డౌన్ సమయంలోనే ఆస్ట్రేలియా కరోనావైరస్‌పై టెస్టింగ్ అస్త్రాన్ని కూడా ప్రయోగించింది..

మే 2 నాటికి ఆస్ట్రేలియా మొత్తం 6,11,583మందికి టెస్టులు నిర్వహించింది. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వలేదు..కాస్త దగ్గు, జలుబు..ముక్కుకారడం కన్పించినా..టెస్టులు చేసింది..ఆస్ట్రేలియా జనాభా దాదాపు రెండున్నరకోట్లు..వీలైనంతమందిని టెస్ట్ చేయడం ద్వారానే కేసులను ఆదిలోనే గుర్తించడం సాధ్యమైందని ఆస్ట్రేలియా స్టోరీ చూస్తే అర్ధమవుతోంది..అంతేకాదు..ఇకపై లక్షణాలు కన్పించనివారికి కూడా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది..అంటే ఇక ఏ కేసూ వైద్యాధికారుల కన్ను గప్పి నమోదు కాకుండా చూడటమే ఆస్ట్రేలియా కరోనా కట్టడిలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది..ఈ ధీమాతోనే ఇప్పుడు వెస్ట్రన్  ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదు..దీంతో పబ్లిక్ గేదరింగ్స్‌పై ఆంక్షలు సడలించడం ప్రారంభమైంది..ఇద్దరికే పరిమితమైనదాన్ని ఇప్పుడు పదిమంది వరకూ కలిసి నిలబడవచ్చనే స్థాయికి రూల్స్ రిలాక్స్ చేసారు..కొన్ని చోట్ల నేషనల్ పార్కులు కూడా ఓపెన్ చేస్తున్నారు.. ఏప్రిల్ రెండో వారం నుంచే ఆస్ట్రేలియాలో కేసులు తగ్గు ముఖం పట్టడం ప్రారంభం కాగా..ఇప్పుడు టూరిస్ట్ సెంటర్లు కూడా ఫిబ్రవరిన నాటి రోజులతో పోల్చుకుంటే సందడి ప్రారంభమైంది..స్విమ్మింగ్ పూల్స్, ఫిషింగ్..గోల్ఫ్ ఆడటం ఇలా చాలావరకూ సాధారణ జీవితం ప్రారంభమైంది..


మే 2 నాటికి ఇక్కడ 6783 కేసులు నమోదు కాగా..వాటిలో 5789మంది కోలుకున్నారు..93మంది చనిపోయారని ఆస్ట్రేలియా ఫెడరల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది..తక్కువ ఆంక్షలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు..ఎక్కువ టెస్టులే ఆస్ట్రేలియాలో కరోనా కంట్రోల్‌లో కీలకంగా మారినట్లు ఆ దేశ ప్రధానే ప్రకటించారు..

ఎలాగైతేనేం ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కరోనాని జయించిన దేశంగా తనకి తాను చెప్పుకుంటోంది..కానీ ఇలా ఒక్కసారిగా ఆంక్షలను సడలిస్తే..మళ్లీ కేసులు తిరగబడే ప్రమాదముందని వార్నింగ్స్ వస్తున్నా..జనం మాత్రం వినడం లేదు..అంతే ఓ సారి లాకులు ఎత్తితే 

Comments