ఆ మంత్రికి నోటీసులు తప్పవా..కరోనా కాలంలో మాక్ హడావుడి



అసలే కరోనాకాలం...ఏది  చేయ్యాలో చేయకూడదో తెలీడం లేదు..ఓ పదిమందికి భోజనాలు పెట్టినా ..నిబంధనలు పాటిస్తున్నామో లేదో తెలీని సిచ్యుయేషన్.. అత్యుత్సాహంగా దగ్గరకి వచ్చి సరుకులు తీసుకున్నా...నిబంధనల అతిక్రమణ అంటారు..మరోవైపు పెద్ద పెద్దవాళ్లేమో అంతకన్నా క్లోజ్ గా తిరుగుతూ కన్పిస్తుంటారు..ఇలాంటి గందరగోళం మధ్యనే...తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సహా ఉన్నతాధికారులపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్‌గా దర్యాప్తు చేయాలంటూ సమన్లు పంపింది...

ఓ వైపు ఇతర ప్రాంతాల్గో భారీగా కేసులు బయటపడుతుంటే..మే 3న కరీంనగర్ టౌన్‌లో  కేసులు లేకుండా మొత్తం జీరో చేసినందుకు... సంబరాలు జరుపుకున్నారంటూ వీరిపై బేతి మహేందర్ రెడ్డి అనే ఓ లాయర్ కంప్లైంట్ చేసాడు.మంత్రి , కలెక్టర్ సహా చాలామంది పాల్గొన్న ఈ ఈవెంట్‌కి 2వేలమంది హాజరయ్యారని ఆయన ఫిర్యాదు చేశాడు..సోషల్ డిస్టెన్సులు..మాస్కులు..మాకులు లాంటివేం లేకుండా..ఇలా చేయడం ఏంటనేది ఆయన కంప్లైంట్..మరి ఫోటోలు చూస్తే..అంతా మాస్కులు పెట్టుకున్నట్లే ఉంది..

డిజాస్టర్ ఎపిడమిక్ యాక్ట్ నిబంధనలను వీళ్లంతా ఉల్లంఘించారంటూ ఎన్‌హెచ్ఆర్సీకి తన కంప్లైంట్‌లో వాదించగా..ఎన్‌హెచ్ఆర్సీ వెంటనే నివేదిక కోరుతూ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది..

బానే ఉంది..కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగమంతా హాజరైనట్లు ఉంది.మరిప్పుడు ఈ దర్యాప్తు ఎవరు చేయాలి..ఎవరు నివేదిక ఇవ్వాలి..ఏమని ఇవ్వాలి...?



Comments