మా బాబాయ్ ఎందుకు చావులెక్కల్లోకి రాలేదు?..హైదరాబాద్‌లో ఝలక్ ఇచ్చిన యువకుడు


దాచాలాని కాదు..కానీ కొన్ని అనివార్యంగా మనకి తెలీవు..దాన్నే మనం నిజాలుగా ప్రకటిస్తుంటాం..అందుకే కొంతమంది మధ్యేమార్గంగా..నాకు తెలిసినంతవరకూ..నా నాలెడ్జ్ వరకూ అని చెప్తుంటారు..ఎందుకంటే మనకి తెలీని అంశాలు ఉండొచ్చనే అర్ధంలో...గత వారంలో సెంట్రల్ టీమ్ హైదరాబాద్‌లో ముందు  మూడు రోజులని చెప్పి..ఐదు రోజుల వరకూ తిరిగింది..వైరస్ ని భలే కట్టడి చేస్తున్నారంటూ టి సర్కార్ని పొగిడేసిందట..

దానికి తగ్గట్లే మనోళ్లూ కూడా సెకండరీ కాంటాక్ట్...(అసలు ఎలా తెలుస్తుంది)కి మేం టెస్టులు చేయమంటూ
ఆ వారంలోనే కీలక నిర్ణయం తీసుకుంది..దీంతో కేసులు కూడా ఆ వారం భలే తగ్గిపోయాయ్..ఏమైందో ఏమో కానీ..మళ్లీ ఈ వారంలో 70కేసులు..అందులో నిన్న ఒక్క రోజే 79 కేసులు బయటపడ్డాయ్..ఈ సమయంలోనే
ఆదిత్య బెల్డే అనే యువకుడు..గత శనివారం తమ బాబాయి చనిపోయినట్లు..(కరోనాతోనే..) మరి జిహెచ్ఎంసీ కానీ..రాష్ట్ర ఆరోగ్యశాఖ కానీ గత శని,ఆదివారాల్లో ఎలాంటి చావులు లేనట్లు ప్రకటించిందంటూ ఓ ట్వీట్ చేశారు..
అది కూడా..ఇద్దరు మంత్రులను ట్యాగ్ చేసి మరీ..

దీంతో పాపం ఇరకాటంలో పడిపోయింది ప్రభుత్వం..అంతే అందరికీ అన్నీ తెలియాలనేముంది..కమ్యూనికేషన్ గ్యాప్ బ్రో అంటూ కవర్ చేస్తారు..అంతేగా..అంతేగా..

Comments