టైమ్ బ్యాడైతే..కుక్కలు కూడా పులిని తరుముతాయ్..




కాలం కాటేస్తే...ఎంతటివారైనా..తగ్గాల్సిందేనంటారు..ఈ కాలమహిమకు లోబడే..అప్పట్లో వసుదేవుడు..గార్ధభాన్ని బతిమాలాడటం..మహాశివుడు..చెట్టు తొర్రలో దాక్కోవడం..అర్జునుడు గాండీవం పనికిరాకుండా పోవడం...ఇలాంటి ఎన్నో డాలు..పనికిరాకుండా పోయాయనుకోండి..

అందుకే కాలానికి తగ్గట్లుగా నడుచుకోవాలని పెద్దవాళ్లు చెప్తుంటారు..అనువుగాని చోట అధికులమనరాదు టైప్ శతకం కూడా ఇందులో భాగమే.. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అలా తాటిచెట్లు పరిస్థితులకు అనుగుణంగా తలలు వంచవు కాబట్టే నేలకూలి..వరదలో కొట్టుకుపోతుంటాయ్..చిన్ని చిన్ని గడ్డిపరకలు మాత్రం జస్ట్ గాలివాలుకు తలవంచి..తర్వాత తలెత్తుకుంటాయ్.



ఇంత పెద్ద ఉపోద్గాతం ఎందుకంటే..రెండు రోజుల నుంచి ఓ చిరుత..హైదరాబాద్ సరిహద్దులనుంచి సిటీలోకి వచ్చి బెదరగొడుతుంది..కదా..! ఆ పులిని నాలుగు వీధి కుక్కలు ఎలా బెదరగొడుతున్నాయో చూడండి...



Comments

  1. నాయనా కుక్కలు గుంపుగా వస్తాయి. టైగర్ సింగిల్ గా వస్తుంది!

    ReplyDelete

Post a Comment