ఓ నామీద దాడి చేసారు..మా మీద దాడి చేసారో అని ఓ రోజు...మరో రోజు అదిగో మమ్మల్ని అరెస్ట్ చేస్తన్నారు..మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు..అదిగో చూడండి ఆ బాబు మా పుచ్చ బగలగొడతా అంటున్నాడు అని మరో రోజు ఇలా..ఎన్ని రోజులు ఎన్ని నాటకాలాడినా..నిజం దాగదు కదా..అలానే ఇప్పుడా ఛానల్ మాపై దాడి..
ప్రజాస్వామ్యవాదులంతా గర్హంచాలి..ఖండించాలి..సూదులతో గుచ్చేయాలి దబ్బనాలతో చించేయాలంటూ రెచ్చిపోయిన వైనం మూడురోజులు తిరగకుండానే పోలీసులు అసలు దుర్మార్గుడిని పట్టుకోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి
పాపం అప్పటికీ అటువైపుగా పోయే పోకిరి వెధవలు..అందులో సిటీలో ఇలాంటి బేవార్సు వెదవాయలు ఎక్కువ ఎవడో ఒకరు రాళ్లేత్తుంటాడని అందరూ చెప్తూనే ఉన్నా...అదేదే పెద్ద ఘోరంలాగా...ఓ రాయి పడగానే..అదిగో మాపై ఎగస్పార్టీ వాళ్లు రాళ్లేత్తున్నారు..ఏందీ గోరం అంటూ రెచ్చిపోయారు..ఇప్పుడేమో చప్పబడాలి..లేదూ ఇంకా ఇందులో కుట్రకోణమంటూ తెగబడితే..పాపం ఇక ఇప్పటికే దేంతోనే నవ్వుతున్నారు..ఇకపై అంతకి మించినదాంతో నవ్వుతారు..
లేదంటే ఈ కూలీ చిరంజీవి మందు తాగలేదని..మందు మత్తులో ఆ చానల్ పై రాయి విసిరాడని పోలీసులు చెప్పడం కుట్ర అంటూ హైకోర్టుకి..తర్వాత సుప్రీంకోర్టుకి..అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా పోతారా...పోండి..
Comments
Post a Comment