బాలయ్య భళా..కార్యసాధకుడు హ్యాపీ బర్త్ డే

దాదాపు 44ఏళ్ల సినిమా జీవితం...తెలుగు చిత్రాభిమానుల ఆరాధ్యదైవం కుమారుడు..ఇంక ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి...ఐనా సరే..బాలయ్య ఇంకా బాలుడే..ఇంకా ఎదురుదెబ్బలు తింటూనే ఉంటాడు..లెజెండ్ వచ్చి ఆరేళ్లవుతోంది..ఒక్క హిట్టు లేదూ..ఎన్ని సినిమాలు వచ్చి పోతున్నాయో లెక్కే లేదు.ఐనా సరే ఆయన క్రేజ్ తగ్గదు..ఒక్క ఆయనకే కాదు..తెలుగువారికి నచ్చాలే కానీ..కనీసం ముప్పైఏళ్లు ఆదరిస్తారు ఎవరినైనా..అలాంటి బాలయ్యబాబుని ఆదరించకపోవడం ఏంటి..ఆయన వారసుడిగా ఎవరో ఒకరు తెరపైన ప్రకటించేవరకూ..బాలయ్య క్రేజ్ తగ్గదు..ఇప్పుడు అరవైఏళ్ల బాలయ్య స్టిల్ చూడండి పైన..ఓసారి..ఒక్క విగ్ పెట్టుకోవడం తప్పించి..ఏదైనా తగ్గుతుందా..అసలు ఓ 35-40ఏళ్ల వయసువాడిలా ఉన్నాడే తప్ప..60ఏళ్ల వృద్ధుడిలా ఉన్నాడా...మరదే మన ముఖ్యమంత్రులను చూడండి..కేసీఆర్ వయసెంత..సరే..మినిస్టర్ల వయసెంత..మహా అయితే బాలయ్య కంటే ఓ నాలుగేళ్లు పెద్ద..అంతే కదా..

పుట్టినరోజు కానుకంటూ..జగదేకవీరుని కథలోని పాటను ఆలపించడం బాలయ్యకే కానుక తప్ప ఇంకెవరికీ కాదు..తనకి ఇష్టమైన దాన్ని చేయడంలోని ఆనందం బహుశా పూర్తిగా పొంది ఉంటాడాయన..ఇక్కడ అనుకున్నది చేసేయడమే తప్ప..ఎవరేమనుకుంటారనేది కాదని..బాలయ్యే చాలాసార్లు చెప్పాడు..ఇప్పుడు చేశాడు అంతే..ఆ పాటకి అభినయించిన ఎన్టీఆర్ కూాడ చేయలేని సాహసం బాలయ్య 60ఏళ్ల వయసులో చేయడం నిజంగా గ్రేట్

గొంతులోని కాఠిన్యం..బొంగురుతనాన్ని ఎగతాళి చేయవచ్చు కానీ..తనకి చేయాలనుకున్న పనిని సాధ్యం చేసుకోవడం కొంతమందికే సాధ్యం..అందుకే బాలయ్య కార్యసాధకుడు 

Comments