కరోనాపై గవర్నర్ మీటింగ్ పట్టించుకోం..సచివాలయం కూల్చేయడంలో బిజీ


ముందర్జంట్‌గా సెక్రటరియేట్ పడేయాలి..దాని తర్వాతే ఏదైనా అన్నంత హడావుడిగా ఒక్క రోజులోనే సచివాలయం పడేసారు..ఇక కొత్త డిజైన్ కూడా వచ్చేసింది కాబట్టి..ఆ డిజైన్ ప్రకారం కొత్త బిల్డింగ్ కట్టేస్తారు..ఐతే దీన్ని యమ ప్రయారిటీగా ఎందుకు తీసుకున్నారో కానీ.. గవర్నర్ సిఎస్ ని కరోనా పై మాట్లాడదం రమ్మంటే రాకుండా..మాకు వేరే పనులున్నాయని చెప్పడం..ఆమెకి కాస్తైనా కోపం తెప్పించుకుండా ఉంటుందా...

రాత్రి ఎకనమిక్ టైమ్స్ ఇదే స్టోరీ వేసిేంది. ఉదయాన్నే ఆంధ్రజ్యోతి కూడా చక్కగా బ్యానర్ ఐటెమ్ వేసింది..
https://economictimes.indiatimes.com/news/politics-and-nation/telangana-governor-to-meet-private-healthcare-providers-amid-standoff/articleshow/76819887.cms
సాక్షిలో కూడా పెద్ద వార్తే వేసారు..ఐతే ఇక్కడ కరోనా అనేది ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సింది..హై సివియారిటీ..హై ప్రయారిటీ ఐటెమ్ కింద..కానీ మరి అంతకన్నా పెద్ద పనులేం ఉన్నాయో వాళ్లెటూ చెప్పరు..అదెప్పటికీ అలానే ఉండిపోతుంది..దేశం...ప్రపంచం అంతా అలానే ఉంది కాబట్టి..మేం ఒక్కళ్లమే కరోనాపై సరిగా వ్యవహరించడం లేదనడం పెద్ద తప్పు..మీరేదో ఇరగదీస్తారనే కదా..పట్టం గట్టింది..పైగా దేశమే ఈ రాష్ట్రాన్ని చూసి రోల్ మోడల్ చేసిందంటూ బాకాలు ఊదుకుందీ మీరే అయినప్పుడు ఇలా నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ లక్ష దాటకపోవడం నిజంగా దుర్మార్గం..ఒక్క ప్రతిపక్షాలు..పేపర్లు అంటే మీకు వ్యతిరేకంగా రాస్తున్నాయని ఆరోపించవచ్చు..మరి హైకోర్టు కూడా అంతేనా..ఇప్పుడా హైకోర్టు చెప్పిందనేగా ఒక్క రోజులో కూల్చేస్తోంది..మరి అదే హైకోర్టు కోరోనాపై ఎన్నిసార్లు  ఎంత గట్టిగా చీవాట్లు పెట్టింది పట్టించుకోరా...?\\
ప్రైవేట్ ఆస్పత్రులతో గవర్నర్ ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి..స్టేట్ లో గవర్నమెంట్ ఉండగానే ఆమెకా అవకాశం ఇచ్చిందెవరు..

Comments