విజయసాయిరెడ్డి గారు ఈ మధ్య అన్నీ చౌకబారు ట్వీట్లు చేస్తున్నారు..హుందాగా వ్యవహరించడం లేదంటూ అన్ని వర్గాలు( ఏవో మరి) నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని కొందరు అనేవాళ్లు..కానీ తనలో చాకచక్యం తెలుగు పదజాలాన్ని వాడటంలో నైపుణ్యాన్ని భలేగా వాడుతూ ఇవాళ అదిరిపోయే ట్వీట్ పెట్టారు..
బిజెపిపైకి టిడిపి మిడతల దండు వచ్చేస్తోందట..ఏడాది కాలంగా ఏదీ దొరక్క నకనకలాడుతున్న టిడిపి దండు ధాటికి బిజెపి ఏమవుతుందోనంటూ వ్యంగ్యంతో కూడిన ఆవేదనాభరితమైన ఓ ట్వీట్ భలేగా ఉందిలెండి..
ఎవరు ఎవరిపై ఎందుకు ట్వీట్ చేశారనేది కాదు..ఇక్కడ పరిస్థితులను పాలిటిక్స్ కి అన్వయిస్తూ చేసిన ఈ ట్వీట్ బహుశా ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి ( లేదంటే ఆయన తరపున ట్వీట్ చేసే టీమ్) పెట్టిన ట్వీట్లలో బెస్ట్ అనుకోవాలి..
విజయ్ సాయి గారి ట్వీట్లు పంచులు బాగుంటాయి. ఆ దెబ్బకు పచ్చ మూకలు బిక్క చచ్చి పోతాయి.
ReplyDeleteమిడతలు దండు ట్వీట్ చాలా బాగుంది.