ఇంత అనుభవం ఉన్న చంద్రబాబుగారు ఇలా మాట్లాడటం సరైనదేనా..కరోనా టెస్టులపై విమర్శలా



 ఏ పని చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది..అది ఏపీలో టిడిపిని చూస్తే అర్ధమవుతుంది
అలానే చంద్రబాబు అండ్ కోని చూసినా అదే అనిపిస్తుంది..దేశంలో కాకపోయినా కనీసం పక్కరాష్ట్రం తెలంగాణలోనైనా
జగన్ ప్రభుత్వం చేస్తోన్న కరోనా టెస్టులపై అసూయ వ్యక్తమవుతోంది..అదెసలు సాధ్యపడుతుంది..ఎలా ఇంత పట్టుదలగా  చేస్తున్నారని అనుకుంటున్నారు..తనకి ఉన్న వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇదంతా చేస్తున్నారని
ముందు నుంచీ చాలామంది చెప్తున్నారు..

దానికి తగ్గట్లే తెప్పించుకున్న కరోనా టెస్ట్ కిట్స్ అద్భుతంగా పని చేస్తుండటంతో..పదే పదే వాటిని దిగుమతి చేసుకుంటున్నట్లు టెస్టుల జోరు చూస్తే అర్ధమవుతోంది..కానీ ఉన్నట్లుండి..ఎవరో ఏదో వీడియో పెడితే దాన్ని పట్టుకుని ప్రభుత్వం అసలు టెస్టులే చేయడం లేదంటూ విమర్శించడం..ట్వీట్లు అటు ఇంగ్లీష్..తెలుగు భాషల్లో పెట్టడం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏదోలా బురద జల్లే ప్రయత్నం తప్ప  వేరేంటి..

అంతెందుకు..ప్రతి రాజకీయనాయకుడిపైనా పగ పగ అంటూ విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు కానీ..వారికి కూడా జైల్లోకో..ఆస్పత్రికో పంపేముందు టెస్టులు చేస్తున్నారు కదా....కనీసం అప్పుడైనా ఈ కరోనా టెస్టులు ఎలా చేస్తున్నారన్నది తెలిసి ఉఁటుంది కదా..దానికి పోయి ఇంత దారుణమైన నిందలు వేయడం ఇంత అనుభవం ఉన్న లీడర్ చేయాల్సిన పని కాదు..అందులో ఇది కరోనా

Comments