ఇవిగో స్వప్నసురేష్ గోల్డ్ స్మగ్లింగ్ లేడీ డీటైల్స్

కేరళలో దొరికిన 30 కేజీల బంగారం రాజకీయంగా పెద్ద కలకలం రేపుతోంది..ఈ కేసులో అనుమానితురాలిగా
భావిస్తోన్న స్వప్నసురేష్‌ని ఐటి కార్యదర్శి పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది..ఐతే కాంగ్రెస్ ఇందులో నిజానిజాలు తేలాలంటే
సిబిఐ దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్ చేస్తోంది.. ఘటనలో దొరికిన సరిత్ అనే వ్యక్తి ముందు తాను కాన్సులేట్‌లో పిఆర్ఓ గా పని చేస్తున్నట్లు  తెలపగా..అది కూడా అబద్దం అని తేలింది..ప్రస్తుతం కేరళ పోలీసులు స్వప్న సురేష్‌ కోసం గాలిస్తున్నారు..


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరువనంతపురంలోని ఆ దేశపు కాన్సులేట్‌కి ఈ బంగారమంతా
వస్తున్నట్లు సమాచారం ఉంది.. మొత్తం 15 కోట్లు విలువైన ఈ గోల్డ్‌ని కస్టమ్స్ ఆఫీసర్లు ఎయిర్‌పోర్ట్ దగ్గర పట్టుకోవడంతోనే ఒక్కసారిగా స్వప్నసురేష్ పేరు తెరపైకి వచ్చింది..ఈమె ఇప్పటివరకూ కేరళ ప్రభుత్వం ఐటీ కార్యదర్శిగా పని చేస్తుండేది అలానే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కి కూడా సెక్రటరీగా పని చేస్తుండటంతో..ఈ స్కామ్ కాస్తా..సిఎంఓ కార్యాలయానికి అంటుకుంది.. మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ విపక్షాలు ఆందోళనకి దిగాయ్..

స్వప్నసురేష్ విషయానికి వస్తే..ఆమె యూఏఈ కాన్సులేట్‌లో గతంలో పని చేసిన చరిత్ర ఉంది..ప్రస్తుతం పోలీసులు స్వప్న ఫోర్జరీ డాక్యుమెంట్ల సాయంతో యూఏఈ నుంచి గోల్డ్ దిగుమతి చేసుకుంటూ స్మగ్లింగ్‌కి పాల్పడుతుందని చెప్తున్నారు..అంతేకాదు పోలీసులు విమానాశ్రయంలో పట్టుకున్న సమయంలో..కేరళ ఐటీ డిపార్ట్‌మెంట్లో పని చేస్తున్న విషయం దాచి పెట్టినట్లు తేలింది..
అబుదాబిలో పుట్టిన స్వప్న సురేష్ తల్లిదండ్రులు తిరువనంతపురానికి చెందినవారు..అబుదాబిలో పాసింజర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్లో పని చేసిన  స్వప్న తర్వాతి కాలంలో తిరువనంతపురానికి చేరింది..ఇక్కడే తన భర్తకి విడాకులిచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. కేరళకి వచ్చిన తర్వాత రెండేళ్లపాటు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయగా
2013లో ఎయిరిండియా శాట్స్‌లో ఉద్యోగం సంపాదించింది.. మళ్లీ మూడేళ్లకి అంటే 2016లో అబుదాబికి చేరింది స్వప్న..అక్కడే యూఏఈలో కాన్సులేట్ జనరల్‌కి సెక్రటరీగా పని చేసింది.. గత ఏడాది తన ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి కేరళ వచ్చినట్లు చెప్తుండగా..పోలీసులు మాత్రం తన విధినిర్వహణలో అవకతవకలకు పాల్పడగా కాన్సులేటే ఆమెని తొలగించినట్లు చెప్తున్నారు


ఐతే యూఈఏ కాన్సులేట్‌లో పని చేస్తున్న సమయంలోనే కేరళలోని బిగ్‌షాట్స్‌తో పరిచయం ఏర్పడింది స్వప్నకి.. అలా తనకి ఉన్న పరిచయాల సాయంతో సిఎం కార్యాలయంలో పాగా వేసినట్లు 
తెలుస్తోంది..ఇప్పుడీ కేసు బైటపడటంతో ఆమె బాగోతాలన్నీ వెలుగు చూస్తుండగా..గోల్డ్ స్కామ్ మకిలి కాస్తా..ముఖ్యమంత్రి కార్యాలయానికి అంటుకుని విమర్శలపాలవుతోంది..


Comments