..అంచేత..ఆ మంత్రిగారిని ఆవు మూత్రమనబడు పంచతమును తాగమనగానే ఏం చేసినారంటే..!


నమ్మకాలు వేరు..వాస్తవాలు వేరు..నమ్మకానికి ఋజువులు ఉండవు..సైన్స్ అనబడు శాస్త్రానికి ఋజువే ఆధారం.
మన దేశంలో సైన్సుకంటే నమ్మకానికే ఆదరణ ఎక్కువ..ఫాలోయింగ్ ఎక్కువ..అయితే ఇప్పుడు కరోనా కాలంలో మాత్రం నమ్మకంతో కూడిన శాస్త్రీయ అలవాట్లకు బాగా ఆదరణ పెరిగింది..పైగా..నమ్మకమే సైన్సనే స్థాయిలో ఋజువులు కూడా కనబడుతున్నాయ్..ఐతే ఎలా అవుతారో..ఏ కోటాలో టిక్కెట్లు కొట్టేస్తారో..మంత్రులుగా కూడా మారతారో తెలీదు కానీ..కొంతమంది ఏకంగా కేంద్రమంత్రులే అయిపోయారు

వాళ్లలో  అశ్వీనీ చౌబే(చూబేనే ఏదోటి) ఒకాయన ఉన్నాడు..ఆయన గొప్పతనం కరోనాకాలంలో అందరికీ బాగా అర్దమైంది..ఇప్పుడు ఆయనకి ధీటుగా మరొకాయన తయారయ్యాడు..పశ్చిమబెంగాల్ బిజెపి  లీడరట..దిలీప్ ఘోష్..అన్నీ మర్చిపోండి గోమాత మూత్రం తాగండి..అని బయలుదేరాడు..గోమాత పూజనీయమే..మన పురాణాలూ పూజనీయాలే..అంత మాత్రాన వాటిని అడ్డం పెట్టుకుని ఓట్లు..రాజకీయాలు చేయడంపై చాలామందిలో ఆక్షేపణ ఉంది..
మరీ..ఇలాంటి కరోడా కరోనా కాలంలో ఇలాంటి ప్రకటనలు ఎంత అనర్ధాలకు దారి తీస్తాయో తెలీదా..గోమూత్రంలో తప్పకుండా వైరస్ ని చంపే గుణాలు కొన్ని ఉండవచ్చు..కానీ ఇలా దోసెట్లో నీళ్లు తాగినట్లు తాగమనడం ఏంటి..
అక్కడికీ ఆ రామ్ దేవ్ అశ్వగంధ..వగైరా ఆయుర్వేద ఉత్పత్తులతో కరోనిల్ అంటూ ఓ దివ్యౌషధాన్ని తయారు చేసానని చెప్పి..తర్వాత వెనక్కి తగ్గాడు..మరి ఈ దిలీఫ్ ఘోష్ కి నిజంగా ఆ నమ్మకముంటే తమ మంత్రులకు..ఎమ్మెల్యేలకు సోకినప్పుడు తాగించాలి కదా..లేదంటే కనీసం ఆయనైనా ముందుగా తాగి చూపిస్తే సరిపోతుంది కదా..
పైగా ఆవుల విలువ గాడిదలకు తెలీదు..మాకు కరోనా రాదంటూ తొక్కలో వీడియోలు ఒకటి..గో మూత్రాన్ని స్టెరిలైజ్ చేసి..అందులో అసలైన యాంటీ వైరల్ లిక్విడ్ ని విడదీసి..ఓ ఔషధంగా తాగండి నాయనలారా అని చెప్పడం వేరు..ఇలా ఎకాఎకిన పేద్ద సైంటిస్టులాగా వాగడం వేరు..ఇలాంటి వాటితోనే అసలు అనర్ధం వస్తుంది
కింద ఓ రిపోర్టర్ ఆవు పంచతం తాగండి అని చెప్పిన లీడర్ కి ఎలా షాక్ ఇచ్చిందో చూడండి
https://www.youtube.com/watch?v=FeGBQIEoulUhttps://www.youtube.com/watch?v=FeGBQIEoulU

Comments