బాబూగారూ వైట్ హౌస్ విందుకు మీరూ రండి..బైడెన్ ఆహ్వానం

 

ఈ ఉదయం చంద్రబాబు గారు తన విజన్తో అమెజాన్ని మన హైదరాబాద్ కి రప్పించబోతున్నారన్న వార్త విని బైడెన్ బేజారెత్తిపోయాట్ట..అర్రే..50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న నేనే చివరాఖరికి కానీ రాష్ట్రపతిని కాలేకపోయాను..కానీ ఈనెవరో చాలా ఎక్స్ పీరియెన్స్డ్ మోస్ట్ పవర్ ఫుల్ విజనరీ లీడర్ అనుకుంటా..మన ప్రమాణ స్వీకారానికి..వైట్ హౌస్లో డిన్నర్ కి ఈయన్ని కూడా పిలిచేద్దాం అనుకున్నారట..

దానికి తోడు చంద్రబాబుగారు కూడా జో బైడెన్ గెలవగానే..ఆయనకి ట్వీట్ చేశారు..శభాష్ భలే గెలిచేసారు..నేనప్పుడే చెప్పా మీరు గెలుస్తారని..అదిగో ఆ కమలాహారిస్ గారు కూడా మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారనడానికి ఎగ్జాంపుల్గా నిలిచారు..మా కోడలూ అంతే ఏదైనా పట్టిందంటే సాదించకుండా ఉండదు..మా పుత్రరత్నం కూడా ఆమెని ఎంకరేజ్ చేస్తుంటాడు అంటూ పర్సనల్ గా కాల్ కూడా చేద్దామనుకున్నారు కానీ..లైన్లు బిజీ కావడంతో ఆపేశారట..

మాటలు కోటలు దాటుతాయ్..చేతలు మాత్రం గడప కూడా దాటదు..అనే సామెత గుర్తు వస్తుందా..అంతే ఏమనొద్దు..
ఆయన ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది..మరి 

Comments

  1. అతను ట్వీట్ ఎం చేసాడో గాని మీరు దానికి పూసిన మసాలా ఎక్కువయింది.
    అవతలొల్లు చేస్తే వ్యభిచారం మీరు చేస్తే సంసారం అయిందా. బావుంది.

    ReplyDelete

Post a Comment