మోదీని మాత్రమే కాదు గుజరాత్‌ని కూడా గెలికేశాడు మరి..తదనంతర పరిణామాలకు రెడీనా గరుడ పురాణ కర్తగారూ
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ఒక్క గాంధీ తప్ప..గుజరాత్ నుంచి దేశం కోసం వచ్చిన సైనికుడు ఒక్కళ్లు లేరట..ఇదీ గరుడపురాణం శివాజీ గారి మాట. మనకి ఓ లీడర్ అంటే పడకపోవచ్చు..మరో నేత అంటే అనవసరమైన అసహ్యం ఉండవచ్చు, ఇంకో రాజకీయనాయకుడు అంటే ఏహ్యభావం ఉండొచ్చు కానీ..అందరికీ దాన్ని ఆపాదించలేం. అలానే ప్రదానమంత్రి గారి వ్యవహారశైలి నచ్చకపోతే పోనీండి, ఆయన చర్యలను తప్పుబట్టండి విమర్శించండి..కానీ గుజరాత్ రాష్ట్రం మొత్తంపై ఇలాంటి కామెంట్లు చేయవచ్చా..?
అసలే ఆయన మోదీ..తనపై పల్లెత్తు మాట అన్నా కూడా గుర్తు పెట్టుకుని మరీ వేధిస్తాడమని కొన్ని వర్గాలు మీడియాలో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంటాయ్. అసలు అందుకోసమే మోదీ అంటే వైఎస్ జగన్ కూడా కాళ్లు వణికిపోయి..గజగజా నీళ్లు కారిపోతారని..కొంతమంది బలంగా నమ్ముతుంటారు..రాస్తుంటారు..ఎద్దేవా చేస్తుంటారు. మరి ఇప్పుడు మన వీరశివాజీ ఓ ఛానల్లో ఈ రేంజ్లో కామెంట్లు చేయడం చూస్తే..ఖచ్చితంగా అబ్బా అబ్బా మన శివాజీ సినిమాల్లోనే కాదు..నిజజీవితంలోనూ హీరోనే అనుకోవాలేమో.
దేశంలోని రాష్ట్రాలు కానీ..కేంద్రపాలిత ప్రాంతాలు కానీ మూకుమ్మడిగా చెడ్డవని..మంచివని చెప్పే హక్కు ఎవరికి ఉంది..ఇలా ఓ ముద్ర వేసే రైట్ ఎవరిచ్చారు..అంతెందుకు కొన్ని ప్రాంతాలపై కావాలని అపహాస్యం పండించే పాత్రలు, రాతలు వాడితేనే కదా..రాష్ట్రం చీలిపోవాల్సి వచ్చింది. తర్వాత ఏమైనా జరగనీయండి..కావాలని ఓ వర్గాన్ని కించపరిస్తే..న్యూటన్ లా ప్రకారం అదే స్థాయిలో అంతే బలమైన వ్యతిరేకత, చవి చూడాల్సి వస్తుంది..ఇదెవరికైనా వర్తిస్తుంది. అంత గొప్ప గరుడ పురాణం వర్ణించిన ఈయనకి మరి పోయి పోయి గుజరాత్ పై పడాలని ఎందుకు అన్పించింది. ఇలాగైతే కానీ తాను తిరిగి లైమ్ లైట్ లోకి రానని అనుకున్నాడంటున్నారు..ఇది నిజమైతే..భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి రావచ్చు మరి..!( as per the propoganda attributing to politcal vendetta by Mr.modi and shaw)
Comments
Post a Comment