అది మీ ఇంట్లో ఫంక్షన్ కాదు కృష్ణా, ఫలక్‌నుమా ప్యాలెస్‍‌లో గెస్ట్‌లు వందల్లోనే ఉంటారు..!

 

దీనినే బహుశా ఏడుపు అందురు..అందుకు మించి ఆక్రోశం వెల్లిబుచ్చడం అందురు..డబ్బున్నోళ్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటారు. మధ్యలో నీకెందుకు అని అడగడం చాలా ఈజీ, కానీ ఇలా ఓ బాక్స్ కట్టి మరీ 
వార్త ఎందుకు వేసారంటే. పక్క పేజీలోనే తన పత్రికకు యాడ్స్ ఇవ్వనందుకు ఆక్రోశం వెల్లిబుచ్చిన వైనం చూశారు కదా..! దానికి ప్రతీకారం అన్నమాట ఇది
పైగా విజయసాయిరెడ్డి మనవరాలు అని రాయడం..అదే మనవరాలు అరబిందో సంస్థ అధినేతకు కూడా మనవరాలు మరి దాన్నెందుకు హైలైట్ చేయకుండా..కేవలం విజయసాయిరెడ్డి బంధుత్వానికే పరిమితం అయ్యారంటే సమాధానం ఈజీగానే అర్ధమవుతోంది.. కావాలనే బురద జల్లితే, కడుక్కోవడం వాళ్ల పని అవుతుంది కాబట్టి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫంక్షన్లకు తక్కువమంది హాజరు కావాలని కోరిన గంటల్లోనే కరోనా నిబంధనలకు తూట్లు పడ్డాయట. ఏం బాబూ జనాలకు మీలానే మైండ్ దొబ్బిందనుకుంటున్నారా..? ఇంకా నయం కేసీఆర్ చెప్పినా పుట్టేవాళ్లు పుడుతూనే ఉన్నారని రాయలేదు..సంతోషం

ఫలక్ నామా ప్యాలెస్ అంటే..అందులో ఫంక్షన్లు చేయాలంటే ఆషామాషీ వాళ్లకి కుదిరేపని కాదు. అది బుక్ చేసుకోవాలంటే గంటకి ఇన్ని లక్షలని ఖర్చవుతుంది. దాని గురించి గతంలో తమరి పత్రికే బోలెడన్నిసార్లు ఆ ప్యాలెస్ దర్జా, విలాసం,  వైభోగం గురించి ఆదివారం ఎడిషన్లలో కూడా అచ్చొత్తేశారు కదా..మరి అక్కడ బర్త్ డే ఫంక్షన్ అంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకుని ఉండొచ్చో ఆ మాత్రం తమరి పచ్చబడ్డ కళ్లకి ఆనడం లేదా..? 

పైగా పోలీసులు ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించారట..పైగా కరెంట్ సరఫరాలో లోపం కూడా తలెత్తిందట..ఛ..ఇంతకంటే దౌర్భాగ్యపు రాతలు ఏమైనా ఉన్నాయా..? ఇలాంటి ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నారు కాబట్టే దినపత్రికలన్నీ జనాల చేతుల్లోకి కాకుండా ఎకాఎకిన టిఫిన్ సెంటర్ల దగ్గరకే పార్సెల్ పొట్లాలుగా మారిపోతున్నాయ్. ఆధారం లేకుండా మనకి ఎవడు ఇష్టం లేకపోతే వాడిపై పడి బురద జల్లడం...మనకి మనమే భుజాలు చరుచుకోవడం...పత్రికలు కొనే జనాల డబ్బుకి ఏ మాత్రం విలువ ఇవ్వకపోతే, ప్రభుత్వాలు మాత్రం ఎందుకు ఇస్తాయి..?

Comments

  1. మరి, ఒకానొక పత్రిక వ్రాసిన ఒకానొక వార్తని బాక్స్ కట్టి చూపించి ఆ వార్తలోని ప్రతి వాక్యాన్నీ వెక్కిరించుటను ఏమందురు?

    దీనినే బహుశా ఏడుపు అందురు..అందుకు మించి ఆక్రోశం వెల్లిబుచ్చడం అందురు.

    ఒక వారం తర్వాత గానీ నెల తర్వాత గానీ టిఫిన్ సెంటర్ల దగ్గిర పార్సెల్ పొట్లాల కింద చేరడం అన్ని దిన వార మాస పత్రికలకీ జరుగుతున్న మర్యాదయే కదా,అయినప్పటికీ అది ఆ ఒక్క పేపరుకే జరుగుతున్న్నట్టు భావించి తమరు వ్యాఖ్యానించడం మాత్రం నిజమైన బహు చక్కని క్యామిఢీ!కొంప తీసి సాక్షికి కవచాలూ గట్రా ఏర్పాటు చేసి అనూహ్యమైన రక్షణ కల్పించారా ఏమిటి?సాయంకాలం అయిదింటికి కూడా "నన్నెవరన్నా కొనుక్కుపొండర్రో!" అని యేడుపు మొహం వేసుకుని కనిపిస్తుంది బుక్ స్టాండుల దగ్గిర!

    ReplyDelete
    Replies
    1. మిత్రమా ఎస్. హరిబాబా..టిఫిన్ బళ్ల దగ్గరకు వారానికో..నెల రోజులకో చేరైట్లైతే. ఇంత వెక్కిరింపు ఎందులకు..పేపర్ బాయ్స్ ఇళ్ల దగ్గర వేయక ముందే సదరు పత్రికలు ఎకాఎకిన టిఫిన్ పొట్లాలుగా మారుతున్న దృశ్యాలు చూపించమందువా..ఇది ప్రతి రోజూ జరుగుతున్న తంతు..లైవ్ రికార్డ్ పెట్టి ఆహ్వానించమందువా..ఏ రోజు డైలీ..ఆ రోజే..ఆ రోజు సాయంత్రం కూడా కాదు..ఆ రోజు ఉదయం 8-9 మద్యనే...ఇక్కడే ఓ వీడియో పోస్ట్ చేసెద..చూసెదరు

      Delete
    2. మిత్రమా నీడ గారూ!
      మీ అంతరంగం నాకు అర్ధమయ్యింది గానీ నా అంతరంగమే మీకు వ్యర్ధమయినట్లు తోచుచున్నది - ఇది కడుంగడు శోచనీయము సుమీ!

      "పేపర్ బాయ్స్ ఇళ్ల దగ్గర వేయక ముందే సదరు పత్రికలు ఎకాఎకిన టిఫిన్ పొట్లాలుగా మారుతున్న దృశ్యాలు చూపించమందువా..ఇది ప్రతి రోజూ జరుగుతున్న తంతు..లైవ్ రికార్డ్ పెట్టి ఆహ్వానించమందువా.." అని మీరు నన్ను కాదు అడగాల్సింది, బ్లాగరు గార్ని.ఏలయన బ్లాగరు గారు "ఇలాంటి ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నారు కాబట్టే దినపత్రికలన్నీ జనాల చేతుల్లోకి కాకుండా ఎకాఎకిన టిఫిన్ సెంటర్ల దగ్గరకే పార్సెల్ పొట్లాలుగా మారిపోతున్నాయ్." అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వ్రాసే చెత్త వార్తల వల్లనే పత్రికలు ఫలహారపు పొట్లాలకు వెళ్తున్నాయని అంటుంటే నేను వేసిన కామెంటు ఇది.

      నేను చాలా స్పోర్టివ్.సభ్యతాయుతమైన వ్యంగ్యం అయితే గర్భశత్రువు నామీద వేసినా ఏమీ అనుకోను.మీరు మిత్రులు కాబట్టి కొంచెం ఘాటు వ్యంగ్యం అయినా నేనూ ఆనందిస్తాను తప్ప మిమ్మల్ని దునుమాడను.

      వీడియో పోస్ట్ వేయుడి,చూసెదము గాక!

      Delete
  2. ‘‘మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.... నేను మీకు పనులు చేసిపెట్టాలి. డబ్బు తీసుకుని ఓట్లేశారు.. మీకు నన్ను అడిగే హక్కులేదు’’ -JC

    "అంతేగా! అంతేగా!" -ప్రజాస్వామ్యం

    ReplyDelete

Post a Comment