వీరమాచనేనికి వేయండి వీరదాళ్లు..! పసలేని వాదనతో పరువు పోగొట్టుకున్న గజనీ, డాక్టర్లు...దేరీజ్ చట్టం అట..ఇలాంటి జాతిరత్నాలెన్నో..




 మన దేశంలో అసలు ఏ రోగానికి ఏ మందు వాడుతున్నామో కూడా తెలీకుండా ఏళ్ల తరబడి వాడే రోగులున్నారు..అలాంటిది దేశ జనాభాలో సగంమందికి అనాయాసంగా వచ్చి పడుతోన్న షుగర్ జబ్బుకి మందు ఉందని ఎవడైనా చెప్పగలడా..అందుకే పాపం ఇవాళ టివి999లో డిస్కోలో కూడా వచ్చిన డాక్టర్లు నోరెళ్లబెట్టారు తప్ప..వీరమాచనేని రామకృష్ణకి జవాబు చెప్పలేకపోయారు


మధ్యలో పాపం యాంకర్ గజనీకాంత్ బుక్కైపోయాడు. ఏదో మాట్లాడబోయి..ఏదో అయిపోయి రామకృష్ణ వాయిస్ కి బలైపోయాడు..పులిహోర అయిపోయి..ఓ పది సెకన్లకి కానీ తేరుకోలేకపోయాడు..చివరకు హలో ఇది..టివి స్టూడియో ..ఇక్కడ అలా మాట్లాడకూడదంటూ...ఏదేదో చెప్పి వెంటనే ఆయన వేసిన డైలాగ్..ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే ..పేకాట పేకాటేనంట..ఇంతేనా యాంకర్ గా ఈయన ప్రతిభ అన్పించింది.

పైగా ఈ తెలుగు చర్చలో అర్ధం పర్ధంలేని  భాషా ప్రయోగాలు..దేరీజ్ చట్టమట..అసలు చైనాలో గుర్తింపు ఉంది కానీ..వీరమాచనేనిడైట్ కి ఎఁదుకు గుర్తింపు లేదంటాడు. చర్చలో పాల్గొన్న డాక్టర్లేమో..ఈయన తగ్గించలేడంటారు..ఆయనేమే తగ్గిస్తా..సవాల్ అంటాడు..

ప్రతిదానీకి ఋజువు కావాలనే సైన్స్..వీరమాచనేని డైట్ తో తగ్గుతుందంటే అంతకి మించిన రుజువేంది..మళ్లీ అలా రుజువు చేసేవాడు కూడా ఓ క్వాలిఫైడ్ కావాలట..ఇంతకంటే విడ్డూరం లేదు..సరే నమ్మినోడి ఇష్టం..వాడేవాడి ఇష్టం


చివరాఖరుకు పాపం..ఎవరికి ఏం అర్ధమైందో..వాళ్లే తేల్చుకోవాలంటూ ముక్తాయింపు..మంచి కాలక్షేపం బఠానీి తప్ప ఇక్కడ ఈ టివి చర్చతో ఏరోజైనా ఎవడికైనా పైసా పరమార్దముందా గురూ

Comments