ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే ముందుగా ఆ పత్రికాధిపతికే పాపం నొప్పెక్కువైంది..ఆన్ లైన్ టిక్కెటింగ్‌పై జనం హ్యపీ

 




ఎక్కడైనా ఎలాంటివైనా రేట్లు తగ్గుతున్నాయంటే ఆనందిస్తారు..వ్యాపారస్తులు , పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులకు భారీ ధర పెడితే..జనం , సామాన్య జనం అవి తగ్గాలనే కోరుకుంటారు. అంతేకానీ..సదరు ఇండస్ట్రీ నష్టపోతుందని ఎవరూ ఏడవరు..కానీ ఇక్కడ సినిమాల విషయంలో మాత్రం ఇండస్ట్రీ నష్టపోతుంది..ఆ సినిమా అన్ని వందల కోట్లు ఎలా రాబడుతుంది


ఇదెలా చేస్తుంది..అంటూ ఆఁధ్రజ్యోతి పత్రిక పాపం జనాల తరపున తామే తెగ బాధపడిపోతోంది


సినిమా వినోదం కోసం..విజ్ఞానం కోసం..అనుకుంటే పొరబాటు..దాని లక్ష్యం ఏదైనా..అది చిన్నజీవికి దూరమైంది. కనీసం రూ.50 రేటు లేకుండా ఏ టిక్కెట్లూ తెగవ్..ఇలాంటప్పుడు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్ముతానంటే..జనాలకు ఏమైనా అన్యాయమా..


లక్ష పెట్టినా అరలక్షకి తెగని మొహాలను కులం పేరు చెప్పి, కుటుంబం పేరు చెప్పి..వారసులమంటూ జనం నెత్తిన నాట్యమాడటానికి వచ్చే అర్భకులు..అక్షరాలను సరిగా ఉచ్చరించలేని అనామకులను..బ్యాక్ గ్రౌండ్ పేరుతో కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ అంటూ 

ఖర్చు పెంచుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ..అదే ఏ బ్యాక్ గ్రౌండ్ లేనోళ్లని సినిమాల్లో తీసుకోమనండి..ఎదురు డబ్బులు అడుగుతారు ఇలాంటి సమయంలో ఆ ఇండస్ట్రీ గురించిన సాధకబాధకాల గురించి సామాన్య జనంకి ఎందుకు పడుతుంది..ఏం స్కూళ్ల ఫీజులు..రోజూ తినే

వస్తువుల ధరలు తగ్గించమంటే తగ్గిస్తున్నారా..అలాంటిది ఈ టిక్కెట్ల రేటు తగ్గిస్తే మాత్రం ఎందుకంత మంట..



పైగా ఈ పత్రిక ఏం రాసుకొచ్చిందో చూడండి..చిన్న సినిమాలను జనం ఆన్‌లైన్లో టిక్కెట్లు పెట్టి కొనరట..చూడరట..అసలు ఆన్‌లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడమే  చేతకాదట..వారెవ్వా నీకు నచ్చని నిర్ణయం తీసుకుంటే..బొంగు ఇష్టం వచ్చినట్లు నీ ఫీలింగ్ రుద్దేయడమే..పెద్ద సినిమాలకి బండ పడుతుందట..అంటే వందలు. వేలు ఒక్కో టిక్కెట్ రేటుకి పెట్టకపోతే..అవి వర్కౌట్ కావని ముందే డిసైడ్ చేసేస్తారా..అంటే నిజంగా ఈ హీరోలకు అంత మార్కెట్ లేదని

అంగీకరించినట్లేగా..అసలు ఇలా ఆన్ లైన్ టిక్కెటింగ్ తో మళ్లీ సినిమాలకు మంచి రోజులే వస్తాయ్..చచ్చినట్లు ఫుల్ హౌస్ వరకే టిక్కెట్లు అమ్ముతారు అలా..గతంలోలాగ దమ్మున్న సినిమాలు 100 రోజులు ..50 రోజుల యాడ్స్ కూడా చూడొచ్చేమో..


అలా ఎందుకు..మాకు ముందు పది రోజుల్లో వచ్చే ( జనం దగ్గర దోపిడీ ) సొమ్మే కావాలంటారా..అదే ఈ పత్రిక కూడా సమర్ధిస్తుందా..

Comments