రోజుకు 14లక్షల కేసులు..కాదు కాదు లక్ష కేసులు గ్యారంటీ ..! భారత్‌లో పరిస్థితిపై అంచనాలతో బెంబేలెత్తిస్తోన్న రీసెర్చర్లు

 


మన దేశంలో కరోనా కేసులు కొత్త వేరియంట్‌తో రోజుకు 14లక్షలు

హీనపక్షం లక్ష ఖాయం 
ఇవి రచ్చబండ దగ్గర చచ్చు కబుర్లు చెప్పుకునేవాళ్లవి కాదు
ఒకరేమో నీతిఆయోగ్ మెంబర్
మరో సర్వేనేమో హైదరాబాద్ ఐఐటిది

గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలలోపే, పాజిటివిటి రేటు 1శాతం లోపే
ఐతే యూకేలో నమోదవుతున్న కేసుల వేగం చూస్తే..మన దేశానికి  అన్వయిస్తే, రోజుకు 14-15లక్షలమంది
వైరస్ బారిన పడతారంటూ నీతిఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పౌల్  ప్రకటించారు. 

" సౌతాఫ్రికా,యూరప్ పరిస్థితి చూసారు కదా..అలాంటి పరిస్థితి మనకి తలెత్తకూడదు. ఓ వేళ వచ్చినా తట్టుకునేందుకు
సిద్ధంగా ఉండాలి "  అంటూ వీకే పౌల్ హెచ్చరించారు. మన కంటే వ్యాక్సినేషన్ రేటు యూకేలో ఎక్కువే. అలానే డెల్టా వేరియంట్ కేసులు కూడా
ఎక్కువే. అయినా రోజుకి 80వేలమంది అక్కడ వైరస్ బారిన పడ్డారంటే..మన దేశంలోనూ అదే స్థితి రాదని గ్యారంటీ లేదు కాబట్టి జాగ్రత్త పడాలనేది
ఆయన ఉవాచ

మరోవైపు ఐఐటి-హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్లు, సైంటిస్టులు వేసిన అంచనాలు కూడా ఇలానే సాగాయ్

ఒమిక్రాన్ వేరియంట్‌లో 50 మ్యూటేషన్స్ ఉన్నాయ్. ఇలాంటి వేరియంట్ గతంలో లేదు. డెల్టా కంటే ఫాస్ట్‌గా పెరుగుతుంది
కాబట్టి, రీఇన్‌ఫెక్షన్‌కి రిస్క్ ఎక్కువ. కాబట్టి హీనపక్షం మన దేశంలో రోజుకు లక్షమంది కొత్త వేరియంట్ బారిన పడతారని
హెచ్చరించింది

యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2 ఓమిక్రాన్ కేసుల నుంచి 10000వేల కేసులు నమోదు అవడానికి పట్టిన సమయం 19 రోజులు
మరి శుక్రవారం భారత్‌లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 100కి చేరింది. అంటే రాబోయే 19 రోజుల్లో ఇదే రీతిన పెరిగితే..?

యూకేలో ఈ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చిందో చూద్దాం
నవంబర్ 27న అక్కడి పబ్లిక్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ 2 ఓమిక్రాన్ కేసులను ప్రకటించింది. తర్వాతి 18 రోజుల్లో 
సెక్రటరీ సాజిద్ జావిద్ , 4713 కేసులను కనుక్కున్నట్లు చెప్పారు. ఐతే సైంటిస్టులు మాత్రం ఈ సంఖ్య 2లక్షలు ఉండొచ్చని అనుమానించారు
రెండు రోజులకు అంటే డిసెంబర్ 15న యూకేలో మరో 4671మంది ఓమిక్రాన్ బారిన పడినట్లు చెప్పారు. దీంతో పదివేలమంది ఓమిక్రాన్
వేరియంట్ బాధితులుగా మారినట్లు అధికారికంగా తేలింది. కానీ ఇప్పుడు రోజుకు 76వేలు..80వేల మంది కోవిడ్ 19 బారిన పడటం
దీని వేగానికి చిహ్నం

అంటే అసలు సంఖ్య కంటే నిజమైన సంఖ్య ఎక్కువని అందుకే ఈ స్థాయిలో కేసులు యూకేలో పెరిగిపోయాయని తెలుస్తుంది..అర్ధమవుతుంది
నవంబర్ 7న అక్కడి కరోనా కేసుల వారంలో సగటు సంఖ్య 33866. కానీ డిసెంబర్ 12న ఇదే సగటు 57838

మరిప్పుడు మన పరిస్థితి చూద్దాం

డిసెంబర్ 2న మొదటి కేసుని గుర్తించగా, డిసెంబర్ 17కి 100కి చేరింది. 15 రోజుల్లో ఈ సంఖ్య అధికారికంగా ఇచ్చినది. ఇప్పటికీ దేశంలో
కోరోనా కేసులు చాలా తక్కువగానే ఉన్నాయ్. ఐతే ఓమిక్రాన్ వాటా మాత్రం పెరిగిపోతోంది.

ఈ ఏడాది జనవరి 26న మన దేశంలో 9102 కరోనా కేసులు గుర్తించగా..మనం దాన్ని జయించినట్లు భ్రమచెందాం. డెల్టా వేరియంట్
2020 అక్టోబర్‌లో ఎంటర్ అయి, నిశ్సబ్దంగా వ్యాపిస్తూ..ఏప్రిల్ నెల నాటికి బైటపడటం ప్రారంభమైంది. 

ఇక్కడే R  నంబర్-అంటే రీప్రొడక్షన్ నంబర్, డిసెంబర్ 15న 0.84గా ఉంది.  అంటే ప్రతి వంద ఓమిక్రాన్ కేసులు 84మందికి అంటించగలవు
అని. మరి ఇంగ్లాండ్‌లో R నంబర్ 1.1. ప్రమాదకర స్థాయికంటే కాస్త ఎక్కువ. ఇప్పుడు యూకేలో R నంబర్ 3-5 మధ్యలో ఉంది
అంటే ప్రతి వంద మంది ఓమిక్రాన్ బారినపడినవారు 300-500మందికి ఓమిక్రాన్‌ని స్ప్రెడ్ చేయగలరు.

ఇదిగో ఇలాంటి లెక్కలన్నీ వేసిన ఐఐటి హైదరాబాద్ టీమ్, మన దేశంలోని 60శాతం మంది టీకా తీసుకున్నవారిలో నిరోధకత ఉంటే
రోజుకు లక్షమంది కొత్తవేరియంట్‌తో కరోనా బారిన పడతారని అంచనా వేసింది. అదే వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఇవ్వలేకపోతే, రోజుకు
ఒకటిన్నరలక్షలమందికి జనవరి 27నాటికి వైరస్ సోకుతుందని చెప్పింది. ఇదే పరిస్థితిని మధ్యస్థంగా అంచనా వేస్తే 
రోజుకు ఒకలక్షా30వేలమందికి సోకుతుందని హెచ్చరించింది. ఈ సంఖ్యలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చు కానీ..జరగదని గ్యారంటీ లేదు. ఇలానే జరుగుతుందన్న రూల్ లేదు. కానీ సెకండ్ వేవ్ సమయంలో ఎలాంటి సీన్స్ చూసారో గుర్తున్నవారికి మాత్రం ఇవి
భయాందోళన కలిగించడం సహజం

Comments