మార్కెట్లలో సహనం, ఎదురు చూడగలిగిన స్థోమత ఉంటే లాభం తెచ్చుకోవచ్చని చాలామందే చెప్తుంటారు. ఐతే అవసరాలు ఎప్పుడెలా వస్తాయో చెప్పలేం కాబట్టి, కొందరు ఒక్కోసారి తమ స్టాక్స్‌ని నష్టాలకు అమ్ముకోవడం కద్దు. ఐతే ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝున్‌వాలా మాత్రం తన లాభం కోసం ఎన్నాళ్లైనా ఎదురుచూడగలరు అనడానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణ
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఐపిఓ షేర్లు ఇవాళ మార్కెట్లలో పూర్‌గా లిస్ట్ అయ్యాయ్. ట్రేడింగ్ కూడా అంతంత మాత్రంగానే
నడిచింది. ఐతే ఈ సంస్థలో రాకేష్ ఝన్‌ఝున్వాలా తన పెట్టుబడికి రూ.6500కోట్ల లాభం ఆర్జించాడు. 30 నెలల క్రితం
రాకేష్ ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. ఐపిఓ తర్వాత ఒక్క రూపాయి కూడా అమ్మలేదు. ఐతే స్టార్ హెల్త్ మాత్రం తన వాటాలను రూ.870-900 రేంజ్‌లో విక్రయించింది
సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో రాకేష్ ఝన్‌ఝన్‌వాలాకి 14.98శాతం వాటా ఉంది.
షేర్లుగా చూస్తే 8కోట్ల 28లక్షల82వేల958 షేర్లు ఉన్నాయ్. మరి ఈ వాటాలకు రాకేష్ పెట్టిన ఖర్చు ఒక్కో షేరుకు దాదాపుగా రూ.155.28.
మరి ఈ షేర్ల ఒక్కో ధర రూ.900. ఇంట్రాడేలో ఈ షేర్లు రూ.940వరకూ కూడా పెరిగాయి. మరి ఇప్పటి ధర చూసారుగా, ఎంత పెరిగిందో
దీంతో ఆయన ఇన్వెస్ట్‌మెంట్ వేల్యూ రూ.7791కోట్లకి పెరిగింది. అంటే ఈ ఒక్క డీల్‌లో గత 30నెలల్లో ఆయన సాధించిన లాభం
రూ.6504కోట్లు (స్టాండలోన్ బేసిస్)
ఇంతటితో కథ అయిపోలేదు. ఆయన భార్య రేఖకి కూడా ఇందులో 3.23శాతం వాటా( 1,78,70,977షేర్లు) ఉన్నాయ్. వాటి ఖరీదు ఇప్పటి రేటులో
రూ.1680 కోట్లు. అంటే దంపతులిద్దరికీ కలిపి రూ.9470 కోట్ల వాటా ఉన్నట్లు లెక్క
మరి పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రావాలంటే ఓపికే కాదు..అదృష్టం ఉండాలి..రిస్క్ తీసుకోవాలి..ఎంచుకున్న పెట్టుబడి పై అవగాహనా ఉండాలి..ఏమంటారు
Comments
Post a Comment