ఫస్ట్ ఓమిక్రాన్ పేషెంట్ వచ్చాడు..ఆల్రెడీ దేశం దాటి పోయాడు కూడా...! సిస్టమ్‌లోని లూప్ హోల్స్ ఇవే



దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఖచ్చితంగా రెండేళ్ల క్రితం చైనాలో ఎలాగైతే కరోనా వైరస్ బయటపడినా

అది ప్రపంచానికి తెలీకుండా కవర్ చేశారో..ఇక్కడ కూడా అదే జరిగింది. ఐతే అది కావాలని చేసిందైతే., మన దేశంలో

ఓమిక్రాన్ వేరియంట్ గురించి మాత్రం ఎవరూ అనుకుని చేసింది కాదు. సౌతాఫ్రికా నుంచి మొత్తం 538మంది కెంపగౌడ విమానశ్రయానికి గత పదిహేను రోజుల్లో వచ్చినట్లు గత కథనంలో చెప్పుకున్నాం కదా, అందులో ఇద్దరకి వైరస్ సోకినట్లు తేల్చగా..వారి రిపోర్టుల కోసం వెయిట్ చేయాల్సి ఉండగానే, సదరు పేషెంట్లలో ఒకరు ఆల్రెడీ దేశం దాటి పోయారట


ఇలా ఫస్ట్ కేసుగా నమోదైన సదరు వ్యక్తి వివరాలు ఇలా ఉన్నాయ్. నవంబర్ 20న మన దేశానికి వచ్చిన ఈ 66ఏళ్ల

వ్యక్తికి కరోనా సోకింది. ఆ తర్వాత వారం రోజులకు దుబాయ్‌కి చెక్కేసినట్లు తెలిసింది. 



1. సౌతాఫ్రికా నుంచి ఇతను నవంబర్ 20న మన దేశానికి వచ్చాడు. ఆ దేశం నుంచి నెగటివ్ రిపోర్ట్‌తో ఎంట్రీ ఇచ్చాడు

బెంగళారు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోఅదే రోజు ఇతనికి స్క్రీనింగ్ జరిగింది


2. ఓ హోటల్‌లో దిగిన ఇతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

3. UPI-IC డాక్టర్ ఈ హాస్పటల్‌కి విజిట్ చేసి ఫిజికల్ టెస్ట్ చేయగా, ఎలాంటి లక్షణాలు లేని కేసుగా ట్రీట్ చేశారు. అలానే సెల్ఫ్ ఐసోలేట్ కావాల్సిందిగా సూచించారు

4. నవంబర్ 22న ఇతని దగ్గర శాంపిల్స్ తీసుకుని, జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు


5. ఓ ప్రవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకోగా, రిపోర్ట్ నెగటివ్‌గా వచ్చింది. 


6. అక్కడికి ఇతను 24మందిని కాంటాక్ట్ చేసినట్లు తెలిసి..వారందరికీ అధికారులు టెస్ట్ చేసారు. అందరికీ నెగటివ్ రిపోర్టులే వచ్చాయ్


7. ఆ తర్వాత అదే నవంబర్ 22, 23న సెకండరీ కాంటాక్టులైన 240మందిని టెస్ట్ చేశారు..వారికి కూడా నెగటివ్ రిపోర్టే వచ్చింది


8. ఇప్పటిదాకా ఈ కథలోని నాయకుడు నవంబర్ 27న అర్ధరాత్రి  12.34ని ఓ క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కి అక్కడ్నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయాడు


అంటే తనవెంట ఓమిక్రాన్‌ని తీసుకువచ్చిన ఇతను ఎవరికీ అంటించకుండా పోయాడనేది పై డేటాని బట్టి తెలుస్తుంది..కానీ వీళ్లే కాకుండా ఇంకెవరికైనా ఉండి ఉంటే..ఏమో చెప్పలేం



ఇది పేషెంట్ నంబర్ 1 కి సంబంధించిన విషయం కాగా, రెండో వ్యక్తి వయసు 46ఏళ్లు. ఈ వ్యక్తికి చెందిన కాంటాక్టులను కూడా టెస్ట్ చేయగా అందరికీ నెగటివే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఐతే కాసేపటి క్రితమే ఈ రెండో పేషెంట్ కి చెందిన ఐదుగురు కాంటాక్టులకు

కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడిక వీళ్లు..వీళ్ల కాంటాక్టుల ట్రేసింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎవరూ భయవిహ్వలులు కావద్దని( panic)

కేంద్రం ప్రకటించింది


ఐతే పైకి ఇలా ఉన్నా..లోలోపల మాత్రం దేశంలో ఓ రకమైన అలజడే ఉంది. ఇప్పుడిక రోజులు గడిస్తే కానీ..ఓమిక్రాన్ ప్రభావం, వేగం, కేసుల సంఖ్య తేలదు


Comments