భయ్యా నీకో పేరు..మళ్లీ దాని ముందు పీకేయడం ఒకటి..! అయ్యా నానిగారూ..ముందు మీ సంగతి చూస్కోండి జనాల జోలికెందుకు
టిక్కెట్లు రేట్లు తగ్గించడం జనాలను అవమానపరచడం అట..
మరి కిలో రూపాయి బియ్యం ఇవ్వడం అవమానం కాదు..రిటైరైన తర్వాత నెలనెలా పెన్షన్ ఇవ్వడం అవమానం కాదు..ఓటర్లేముంది
బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముడయ్యారంటూ ఓడిపోయిన పార్టీలు ఆక్రోశిస్తే అవమానం కాదు. మీ ఫంక్షన్లకు గ్యాలరీలు పెట్టి గేట్లు పెట్టి లోపలేసి
మీరు మాత్రం దర్జా ఒలకబోస్తే అవమానం కాదు.
ఆఖరికి మీ ఫంక్షన్లలో డయాస్ మీదకు వస్తే కాళ్లు విరగ్గొట్టడం తోసేయడం అవమానం కాదు. సదరు సినేమా నటుడు నానిగారు
వేసిన సుభాషితం ఇది
అరే టిక్కెట్ల రేటు తగ్గిస్తే మాత్రం ఎక్కడ ఆ రేట్లకు అమ్ముతున్నారు భయ్యా..! అసలు నీ ఏడుపు తగిలిన సి క్లాస్ థియేటర్లు ఏపీలో ఎన్ని
ఉన్నాయో తెలుసా..? ఆ లెక్క ఏమైనా ఉందా..మీ సినేమాల బెనిఫిట్ షోలకు ఒక్కో టిక్కెట్ రేటు 200 అంటేనే మాకు కడుపు కాలిపోతుంది..
పిచ్చ అభిమానంతో వెర్రెక్కి చూడటం వరకూ ఓకే, కానీ ఇలా రెండు మూడు వారాలు రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఏంటి..పర్మిషన్లు ఏంటి
ఇదెక్కడి ఘోరం..అందుకే ప్రతిదాన్నీ ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టే..మీ్ సినేమాలు..మూవీరూల్జ్ లో..ఐబొమ్మల్లో రెండో రోజుకే దింపేసి
హ్యాపీగా జనం ఇళ్లలోనే చూస్తున్నారు..
అసలు కోట్లకి కోట్లు పెట్టి తీస్తేనే నాణ్యత వస్తుందా..సరే పోనీ మీ ఇష్టారాజ్యంగా టిక్కెట్ల రేట్లు పెంచుకోండి..అలాగ..హిట్టైన సినిమాలు గత రెండేళ్లక్రితం ఎన్నని? అంటే చచ్చు పుచ్చు టమోటాలను తొందరగా అమ్మేస్తే పెట్టుబడి రాబట్టుకోవడానికేగా ఈ తంత్రం
అసలు పెట్టుబడి ఇలాగ కోట్లకి కోట్లు పెరిగిపోవడంపై మీ సినేమా పెద్దలు గత పదేళ్లుగా మొసలి కన్నీరు కార్చుతూనే ఉన్నారు కదా..మరి వాళ్లు ఇప్పుడు
హ్యాపీగా లేరా..? వదిలేద్దాం..కన్నడం, మలయాళంలో మంచి సినిమాలు రావడం లేదా..బడ్జెట్ 20 కోట్లలోపే వాళ్లు ఇరగదీయడం లేదా..?
అసలు ఏడుపు అది కాదు మీది! ఎక్కడ గతకాలపు సూపర్ స్టార్లలాగా ఏ పాతికలక్షలకో పని చేయాల్సి వస్తుందనేది మీ ఏడుపు..ట్యాక్సులు వగైరా పక్కనబెట్టండి..అసలు మీరే చేసే పనికి ఇంత అని మీరు ఎందుకు ఫిక్స్ అయ్యారు. ఇదే ఏ రైతుకూలీనో..ఫ్యాక్టరీల్లో పని చేసేవాళ్లో..లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగులో
తమ జీతం ఇంత అని చెప్పుకోగలరా..ఫిక్స్ చేసుకోగలరా...మీరు కొట్టేది హిట్టు ఎప్పుడో..కానీ వీళ్లంతా రోజూ సరిగానే పని చేస్తారు..
కాదు అది వాళ్ల ఖర్మ అంటారా..సరే మరి..మీ ప్రొడక్ట్ అమ్మడానికి రేటు ఎందుకు ఫిక్స్ చేయరు..టిక్కెట్లు రేట్లు తగ్గితే ఓవరాల్‌గా జనం ఏడవరు..సంతోషపడతారు..రోజువారీ ఖర్చుల్లో కాస్త డబ్బు మిగిలిందని సంబరపడతారు..నిజంగా మీ సరుకు అంత గట్టిదే అయితే..వంద రోజులు ఆడేంతగా తిరిగి తిరిగి చూస్తారు..ఎటొచ్చీ మీ సరుకుపై మీకు నమ్మకం లేదు అంతే..! దీనికేదో నా నేచురల్ స్టార్ తీసేస్తా...అంటూ శపథాలు..ఎవడిచ్చాడు గురూ నీకా భుజకీర్తులు
ఎవడికి వాడు తగిలించేసుకోవడం..దానిపై ఓ తెగ ఫీలవడం..రీల్ హీరోలు..రియల్ హీరోలు అవుతారా..అయి చూపించండి..జనం బ్రహ్మరధం పడతారు
aayana remuneration tagginchukonte cinema budget taggutundi.....kaani......tagginchadam ante aayanani avamaana parachadam kadaa
ReplyDeleteNijamga janalu chostunnaru anna jannam ledu
ReplyDelete