ఓమిక్రాన్ వస్తే ఫేమస్ డాక్టర్లు ఏం వాడుతున్నారో తెలుసా!!!! జై జగన్

 


వీడియో కోసం క్లిక్ చేయండి ఈ లింక్ https://youtu.be/5caAYgnIgQI


ఓపిక లేదనుకుంటే కింద విషయాన్ని చదవండి


ప్రపంచమంతా ఒమిక్రాన్ వైరస్ వేరియంట్‌తో వణికిపోతుంటే..మన ఢిల్లీ డాక్టర్లు మాత్రం దాన్ని చాలా సునాయాసంగా తగ్గించేశారు. చాలా చాలా సింపుల్ ట్రీట్‌మెంట్‌తో..!


జస్ట్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ గొట్టాలతోనే ఈ డేంజరస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వేరియంట్‌ వచ్చిన 40మందికి

ట్రీట్‌మెంట్ ఇచ్చారు లోక్‌నాయక్ జయప్రకాశ్ హాస్పటల్ డాక్టర్లు. ఈ హాస్పటల్ ఢిల్లీలోనే లార్జెస్ట్ హెల్త్‌కేర్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ హాస్పటల్

ఓమిక్రాన్ కేసులు ఢిల్లీలో ఇప్పటిదాకా 40మందికి సోకగా, వారిలో 19మంది ఆల్రెడీ డిశ్చార్జ్ కూడా అయ్యారు 


ఇప్పుడు 21మంది యాక్టివ్ పేషెంట్లకు ఇస్తున్న ట్రీట్‌మెంట్ కేవలం ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు మాత్రమే అని ఓ సీనియర్ డాక్టర్

చెప్పుకొచ్చారు. ఇవి కాకుండా వేరే ఏ ఇతర మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం పడలేదనేది ఆయన మాట. పైగా వీరిలో 90శాతంమందికి ఎలాంటి ఇబ్బందులు లేకపోగా, మిగిలినవారికి గొంతునొప్పి, వళ్లు నొప్పులు, కాస్త జ్వరం మాత్రమే ఉన్నాయట. 


ఇంకో విషయం ఏమిటంటే, ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఓ ఆఫ్రికాదేశపు ఎంపి కూడా ఉన్నారట. అలానే ఉత్తరాదిన ఓ 

రాజవంశీకుడికి, కొంతమంది ఐఎఎస్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. 


ఢిల్లీలో మొత్తంగా 67మందికి ఓమిక్రాన్ కరోనా సోకగా, వారిలో 23మంది రికవర్ అయ్యారు 


ప్రతి రోజూ లోక్ నాయక్ ఆస్పత్రిలో వంద నుంచి 200 శాంపిల్స్ జినోమ్ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య

భారీగా పెరుగుతుందనే అంచనాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐతే ఇలాంటి తరుణంలో ట్రీట్‌మెంట్ చాలా సింపుల్‌గా ఉండటం

సంతోషించాల్సిన విషయం. ఐతే ఇదే రకమైన చికిత్స అందరికీ పనిచేయకపోవచ్చు. ఐతే మరీ ఓమిక్రాన్ వచ్చేసింది కాబట్టి..ఇక జీవితం అంతం

అయిపోతుందనే రేంజ్‌లో ఛానళ్లు బెదరగొడుతున్నాయ్ కాబట్టి..వాటికి విరుగుడుగానే ఇలాంటి సంఘటనలను ఉదహరించవచ్చు. జాగ్రత్తే

ముఖ్యంకానీ మరీ బెంబేలెత్తాల్సిన అవసరం లేదనేది ట్రీట్‌మెంట్ ఇస్తోన్న డాక్టర్ల ఉవాచ. తదనుగుణంగా నడుచుకోవడమే అందరూ 

చేయాల్సిన పని




















Comments