మన గీతకి ప్రపంచస్థాయిలో పట్టం..! IMF సెకండ్ ర్యాంక్‌కి ఎలివేషన్



 గీతా గోపినాధ్( ఓవర్సీస్ ఇండియన్)‌కి మరో గొప్ప పదవి దక్కింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో కీలకమైన పదవి నిర్వహిస్తోన్న ఆమె, వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ఈ సంస్థలో టాప్ సెకండ్ ర్యాంక్‌ దక్కనుంది.ఐఎంఎఫ్ FDMDగా తనకి ఎలివేషన్ లభించింది


జ్యాఫ్రీ ఒకమాటో ఇప్పటిదాకా   FDMDగా కొనసాగుతుండగా, ఆయన బాధ్యతల నుంచి వచ్చే ఏడాది తప్పుకోబోతున్నారుదీంతో గీతా గోపినాధ్ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జేయివా ఆధ్వర్యంలో తన కొత్త పదవిని స్వీకరించనుండగా, ఇలా ఇద్దరు మహిళలు  ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో టాప్ ర్యాంక్స్‌లో ఉండటం ఓ రికార్డు కానుంది



ప్రపంచంలోనే మేక్రోఎకానమిస్ట్‌గా గీతా గోపినాధ్‌కి మంచి పేరుంది. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో గీతా గోపినాధ్ ఈ కొత్త పదవిని చేపట్టనుండటం సరైన సమయంలో సరైన వ్యక్తికి దక్కిన గౌరవంగా IMF చీఫ్ క్రిస్టాలినా ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తడం

విశేషం. ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా మూడేళ్ల నుంచి కొనసాగుతున్న గీతా గోపినాధ్, తన పదవి కాలం పూర్తి కాగానే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది కరోనా సమయంలో తన అంచనాలు, వ్యాఖ్యలు, విజన్ ద్వారా ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించారీమె.మన దేశంలో పుట్టి, అమెరికా పౌరసత్వం కలిగిన ఓవర్సీస్ ఇండియన్. 

Comments