దేశంలో కరోనా ఎలా విస్తరిస్తుందో జస్ట్ 5 ఛార్టుల్లో చూడండి..లక్షా60వేలమందికి సోకిన కరోనా..ఇక రోజుకి 20లక్షలకి చేరడం జరగని పనా

 నిపుణులు, గణాంక శాస్త్రవేత్తలు, పరిశీలకుల అంచనాలు అన్నీ మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ పతాకస్థాయి ఫిబ్రవరిలో ఉండొచ్చని చెప్తున్నాయ్. ఐతే గత నవంబర్, డిసెంబర్‌లో ఈ పండితులే, అసలు థర్డ్ వేవ్ రాకపోవచ్చని, వచ్చినా సెకండ్ వేవ్ స్థాయిలో ఉండదని కూడా చెప్పారు. కాబట్టి ఈ అంచనాల మాటకేం కానీ, పరిస్థితిని ప్రమాదకరంగా లెక్కిస్తేనే, నష్టం తక్కువ స్థాయిలో వాటిల్లడానికి అవకాశం

ఉంటుంది.  జనవరి 26కే పతాకస్థాయికి చేరవచ్చనేది నా అంచనా


గడచిన 24 గంటల్లో మన దేశంలో నమోదు అయిన కేసుల సంఖ్య 1,59,632


ప్రస్తుతం ఆదివారం కర్నాటకలో 12000( గత రోజుతో పోల్చితే 35శాతం ఎక్కువ) కేసులు బైటపడగా, వెస్ట్‌బెంగాల్‌లో 24287మందికి

కొత్తగా వైరస్ సోకింది. ఢిల్లీలో 22751మందికి సోకగా, ఇది గత రోజుతో పోల్చితే 13శాతం ఎక్కువ. ఇక  మహారాష్ట్రలోని ముంబైలో 19474మందికి

సోకింది, ఈ సంఖ్య కిందటి రోజున 20971గా ఉంది. అలానే మొత్తంగా రాష్ట్రంలో 44388మందికి కొత్తగా కోవిడ్ సోకింది. ఇక్కడ హోమ్ క్వారంటైన్‌లో

ఉన్నవారి సంఖ్య 10.7లక్షలు. 


కేరళ,గుజరాత్‌లో కొత్తగా చెరో 6 వేల కేసులు నమోదు అయ్యాయ్


ఓ ఐదు ఛార్టులలో ఈ పరిస్థితిని ఇంకాస్త చక్కగా అర్థం చేసుకుందాం


రోజువారీ కేసులు నమోదవుతున్న క్రమం చూడండి




ఎక్కువ కేసులున్న రాష్ట్రాల ఫోటో ఇది



ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న నగరాల ఫోటో ఇది



ఇక ఏ వేవ్ సందర్భంగా ఎక్కువ మరణాలు సంభవించాయో తెలిపే చార్ట్ ఇది. గడచిన 24 గంటల్లో 327మంది

కరోనా వైరస్‌కి బలయ్యారు




పై ఫోటోలో ఎర్ర భాగం ఉన్న రాష్ట్రాల్లో ఓమిక్రాన్ బైటపడినట్లు..లేనిచోట ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా బయటపడనట్లు..ఈ ఫోటోలన్నీ కూడా టైమ్స్ ఆఫ్ ఇఁడియావే

Comments