అంతట..ఇక ఆ ములుగు స్వరం విన్పించదు..! పాతికేళ్ల క్రితం ఆయనేం చేసేవాడో తెలిస్తే నిజంగానే విధివిచిత్రం..!



 ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి..సిద్ధాంతిగా మారకముందు ఏం చేసేవాడు..జస్ట్ ఓ ఆలోచన చేయండి...ఎవరికి తోచిన వీలైన వృత్తుల్లో వారు బతకడం లోకసహజం. అయితే ఈ సిద్ధాంతిగారు తన పూర్వాశ్రమంలో ఇప్పటి ప్రవృత్తి, వృత్తికి పూర్తి భిన్నంగా ఉండేవాడు.


నేనే ప్రత్యక్షసాక్షి. నాకు ఆయనే ఈయన అని తెలీదు కాబట్టి ఇన్ని రోజులు రాయలేదు.ఇప్పుడు వ్రాస్తున్నా ఆయన ఓ మామూలు సగటు మనిషి..చేతనైన విద్య అయిన మిమిక్రీతో మిమిక్రీ ప్రసాద్, మిమిక్రీ శ్రీనివాస్, వేణుగోపాల్, ఆస్కార్ జాషువా వంటి వారితో కలిసి తిరిగేవాడు. నెత్తిన ఓ టోపీ( బాల్డ్ హెడ్ ఉన్నోళ్లు పెట్టుకునే టైప్ వన్నమాట) పెట్టుకుని టివిఎస్50పై తిరుగుతుండేవాడు..


వన్స్ అపానే టైమ్ అన్నమాట 1997-2000 వరకూ ఇదే జరిగింది. కానీ ఉన్నట్లుండి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత అనే సమాచారం తెలియగానే, ఇక  పాత జీవితం వెలికి రావడం విధివిచిత్రం..ఎక్కడి గుంటూరు జిల్లా నరసరావుపేట, ఎక్కడి యాదాద్రి, కేసీఆర్, జగన్, వైఎస్ఆర్, ప్రభుత్వాలచేత సన్మానాలందుకోవడం..అన్నీ చూస్తే..ఓ సినిమా జీవితం అనుకోవాల్సిందే


మిమిక్రీ చేస్తూ..ఏవిఎస్, బ్రహ్మానందం, ధర్మవరపు వంటివారితో కూడా కలిసి తిరిగేవారట. ఇది బ్రహ్మానందం గారే కన్ఫామ్ చేయాలి అలానే లోకప్రసిధ్ది పొందిన శ్రీదేవి పెళ్లి ఆడియో కేసెట్...కి ఈయనే స్వరకర్త అంటే నమ్ముతారా ఎవరైనా



ఇప్పటకీ మిమిక్రీ సినిమా కేసెట్లలో ఇదే బెంచ్ మార్క్..ఆ తర్వాత చిరంజీవి శ్రీదేవి పెళ్లి పెటాకులు, చిరంజీవి చీఫ్ మినిస్టర్, ఆనందోబ్రహ్మ

అనే కేసెట్స్ చేశారని తెలుస్తోంది. ఇంకా తెలియని కేసెట్లెన్నో..కేవలం ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ తన హాబీ అయిన జ్యోతిష్యంవైపు మళ్లడమే విధివిచిత్రం. ఆయన స్వతహాగా చిరంజీవి అభిమాని కావడంతో..కొంతమంది కొంటె కుర్రాళ్లలాగా కృష్ణ, ఏఎన్ఆర్పై ఎగతాళిగా స్కిట్స్ ముగించేవాడు



.ఇక కరోనా థర్డ్ వేవ్ తడాఖా చెప్తానంటూ...రకరకాల సవాళ్లు చేసి..చివరకు నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోవడం కూడా విధివిచిత్రమే..బహుశా ఆయన వారసత్వాన్ని శిష్యపరమాణువులు..సంతానం కొనసాగిస్తారేమో..ఎందుకంటే..జ్యోతిష్యం ఎంతటి వ్యాపారమో ఈయన పొందిన పదవులు..కీర్తి ప్రతిష్టల ద్వారా కళ్లకి కట్టినట్లు కన్పిస్తుంది కదా...!

Comments