స్టాక్ మార్కెట్లు దాదాపు 12 సెషన్లు తర్వాత భారీ నష్టాలతో ముగిశాయ్. దీనికి అమెరికాలోని FOMC సమావేశ ఫలితాలపై అప్రమత్తతే
కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మరో కారణం, మొత్తంమీద, నిఫ్టీ50 20,850-20,800 స్థాయిలో
సపోర్ట్, 21,000-21,100 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కొంటోంది.
డిసెంబర్ 12న,సెన్సెక్స్ 378 పాయింట్లు పతనమై 69,551 వద్దకు, నిఫ్టీ50 91 పాయింట్లు క్షీణించి 20,906 దగ్గర ముగిశాయ్
టెక్నికల్‌గా మొన్నటిలానే బేరిష్ క్యాండిల్‌స్టిక్ నమూనా ఏర్పడింది.
టెక్నికల్‌గా చూసినప్పుడు , " నిఫ్టీ జర్నీ సాఫీగానే ఉన్నా.. క్యాండిల్‌స్టిక్ నిర్మాణాలను చూసినప్పుడు బుల్ ర్యాలీకి ఓ బ్రేక్ ఇస్తున్నట్లు కన్పిస్తుందని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ ఓషో క్రిషన్ అభిప్రాయపడ్డారు. ఇక లెవల్స్ విషయానికి వస్తే, 20,850-20,800 తక్షణ మద్దతుగా కనిపించే అవకాశం ఉందని, తర్వాత బుల్లిష్ గ్యాప్ 20,700గా ఉంటుందని చెప్పారాయన. ఫ్లిప్ సైడ్‌లో, "21,000-21,040 మేజర్ రెసిస్టెన్స్ కాగా, 21,100 జోన్‌ని చూడాలన సూచించారు
Comments
Post a Comment