హిందుస్తాన్ ఏరోనాటిక్స్ స్టాక్ ప్రైస్ ఈ రోజు 6శాతం వరకూ లాభపడింది
వీకెండ్‌లో ఈ స్టాక్ తన 52వీక్స్ హై దగ్గర ట్రేడ్ అవడమే కాకుండా 2లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన సంస్థల క్లబ్‌లో చేరిపోయింది
ఇంట్రాడేలో HAL స్టాక్ రూ. 3079కి చేరి..ముగింపులో మాత్రం రూ.2998.85 దగ్గర నిలిచింది
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యుబిఎస్ HALకి బై రేటింగ్‌తో కవరేజ్ ఇస్తూ..రూ.3600 టార్గెట్ ప్రైస్
ఫిక్స్ చేసిన నేపథ్యం ఉంది
ఇప్పటికే ఈ సంస్థ దగ్గర 80వేలకోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉండగా..ఇంకా రాబోయే రోజుల్లో రక్షణరంగం నుంచి భారీగా ఆర్డర్లు రాబోతున్నాయ్. లాంగ్ టర్మ్ వ్యూని దృష్టిలో పెట్టుకున్నవాళ్లకి ఈ స్టాక్ చక్కని రిటన్స్ ఇస్తుందని యుబిఎస్ చెప్తోంది

Comments
Post a Comment