లక్షా32వేలు..మూడురోజుల్లో 50వేలు లాభం తీసుకురాగలిగితే.., నెక్స్ట్ వీక్ గెట్‌రెడీ..న్యూస్వాన్ మల్టీటెక్ SME ఐపిఓ
ఆటోమోటివ్స్ యంత్రాలు..వాహనాలు ప్రత్యేకించి వ్యవసాయరంగంలో తయారుచేసే న్యూ స్వాన్ మల్టీటెక్నాలజీస్ ఐపిఓ జనవరి 11న ఓపెన్ కాబోతోంది
ప్రైస్ బ్యాండ్ చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. కేవలం రూ.62-66మాత్రమే అవడంతో..జనం ఎగబడటం ఖాయంగా ఉంది. ఐతే లాట్ సైజ్ ఏకంగా 2వేల షేర్లు
కావడంతో..జనరల్ యావరేజ్ రిటైల్ ఇన్వెస్టర్ దీనిపై ఫోకస్ పెట్టకపోవచ్చు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ లక్షా32వేలు పెట్టాలి మరి..!
కంపెనీ IPOతో రూ.33.11 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5,016,000 ప్రెష్ ఈక్విటీ షేర్లు,కన్వర్‌దీప్ సింగ్, ఉపకార్ సింగ్, బరున్‌ప్రీత్ సింగ్ అహుజా కంపెనీకి ప్రమోటర్లు కాగా, జనవరి 11-15 వరకూ ఇష్యూ ఓపెన్ అయి...16 కల్లా షేర్లు అలాట్ కావడం కూడా పూర్తవుతుందంటున్నారు.
న్యూ స్వాన్ మల్టీటెక్ షేర్లు జనవరి 18న BSE SMEలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
1985లో ఆటోమోటివ్ ఉత్పత్తులను తయారీదారుగా ఉన్న కంపెనీ.. ఇంజిన్ హ్యాంగర్, హింజ్ బాడీ కవర్, ఫ్యూయల్ ఫిల్లర్, ఇంజిన్ గార్డ్ ప్లేట్, రియర్ బ్రేక్ ఆర్మ్ అసెంబ్లీ, సెపరేటర్ బ్రీదర్స్, కేబుల్ గైడ్ అసెంబ్లీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ క్లయింట్లలో టాటా మోటార్స్, హీరో మోటార్స్, మారుతీ సుజుకీ, సుజుకి, హోండా, మహీంద్రా టూవీలర్స్ ఉండటంతో..మార్కెటింగ్‌కి ఢోకా లేనట్లు అర్థమవుతోంది.
Comments
Post a Comment