నాలుగు రోజుల్లోనే అలోక్ ఇండస్ట్రీస్ షేరు ధర కేక పుట్టించేసింది.ఏకంగా 51శాతం
పెరిగి ఐపిఓలకు ధీటుగా రాబడి ఇచ్చింది. జనరల్‌గా ఈ మధ్యకాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా తీసుకున్నా..ఆ కంపెనీల షేర్లు పెద్దగా పెరగవంటూ ఓ వాదన బయలుదేరింది. కానీ ఇది మాత్రం అది తప్పని ప్రూవ్ చేసింది.
శుక్రవారం కూడా ఈ స్టాక్ 20 శాతం అప్పర్ సర్క్యూట్ లాక్ చేసి రూ.32.50కి చేరింది
ఎవడైనా ఈ కంపెనీ షేర్లు మోస్తూ..నాలుగు రోజుల క్రితం రేటు ఇప్పుడు రేటు చూస్తే బిత్తరపోతారేమో అన్నట్లుగా పెరుగుతోంది అలోక్ ఇండస్ట్రీస్ ! అలోక్ ఇండస్ట్రీస్ కి చెందిన 3300 కోట్ల ఎన్సీడీ ప్రిఫరెన్షియల్ షేర్లను రిలయన్స్ కొనుగోలు చేసింది..ఒక్కోదాన్ని ఒక్కో రూపాయి ధరతో రూ.3300కోట్లు ఖర్చు పెట్టింది.
అలోక్ఇండస్ట్రీస్‌ని జేఎం ఫైనాన్షియల్ ఏఆర్సీ. రిలయన్స్ కన్సార్టియం కలిసి కొనుగోలు చేయగా..రిలయన్స్‌కి 40శాతంవాటా దక్కించుకుంది. అలోక్ ఇండస్ట్రీస్ ఒకప్పుడు టెక్స్‌టైల్ రంగంలో ఓ వెలుగు వెలిగింది. పాలీస్టర్ ,యార్న్, అప్పారెల్ ఫాబ్రిక్స్, గార్మెంట్స్ తయారు చేసేది. ఇప్పుడు రిలయన్స్ తీసుకున్న తర్వాత తిరిగి
వ్యాపారం పుంజుకుంటుందని టాక్

Comments
Post a Comment