రెన్యువబుల్ ఎనర్జీ బూమ్ ఓ రేంజ్‌లో సాగుతుండటంతో..ఈ రంగంలోని చిన్నా చితకా షేర్లు కూడా భారీగా లాభపడుతున్నాయ్.
అలా రేటుపరంగా పెద్ద కంపెనీషేరుగా..మార్కెట్ కేప్ పరంగా స్మాల్‌క్యాప్ సెక్టార్‌లో ఉన్న వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్ షేర్లు కూడా వరసగా దంచి కొడుతున్నాయ్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు అప్పరప్పర తాండ్రరాగమేసింది
రూ.2689.40 దగ్గర వీకెండ్‌లో క్లోజైంది. ఈ బజ్‌కి కారణం..స్టాక్ స్ప్లిట్ న్యూస్ స్ప్రెడ్ కావడమే...!
హిస్టారికల్ ప్రైస్ చూస్తే..లాస్ట్ జనవరి 11న( 2023) 52 వారాల కనిష్ఠమైన రూ.470 వద్ద ఉండగా, జనవరి 5(2024)న రూ.2703.95కి చేరింది
టెక్నికల్‌గా ఓవర్‌బాట్ అంటూ చెప్తున్నా..ట్రేడర్లు మాత్రం స్టాక్ వెంట పరుగులు తీస్తున్నారు. జనవరి 20న బోర్డ్ మీటింగ్‌లో ఈ స్టాక్ స్ప్రిట్ విషయంలో
నిర్ణయం ప్రకటించబోతున్నారు. కాగా.., వారీ రెన్యూవబుల్స్ దేశంలోని సోలార్ ప్యానెల్ ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపుఉంది
కంపెనీ ఇప్పటికే 10,000కు పైగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. కంపెనీ చేతిలో 600 మెగావాట్ల కంటే ఎక్కువసామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయ్
Comments
Post a Comment