ఫ్యాన్సీ పేమెంట్ యాప్ స్టార్టప్ మొబిక్విక్ ఎట్టకేలకు ఐపిఓకి రాబోతోంది. సెబీకి రెడ్‌హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ.700కోట్లు సమీకరించబోతోంది ఈ పేమెంట్,యాప్..!
వాస్తవానికి రెండేళ్ల క్రితమే లిస్ట్ కావాల్సిన ఈ కంపెనీ..ఎందుకో వెనక్కి తగ్గింది. ఇప్పుడు తిరిగి సెబీకి ఐపిఓకోసం అప్లై చేసుకుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది.అదైతే.. ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది.
కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి. పేటిఎం,గూగుల్ పే, ఫోన్ పే అంత పాపులర్ కాకపోయినా..మంచి ఆఫర్లతో
కొన్ని సెగ్మెంట్లలో మోబిక్విక్ పాపులర్ అయిన కంపెనీనే..!
Comments
Post a Comment