దంచికొట్టిన BLS ఈ సర్వీసెస్ , రూపాయికి 3 రూపాయల లాభం, వారంలోనే..!


ఐపిఓలు లిస్టింగ్ గెయిన్స్ ఇస్తే ఎలా ఉంటుందో..BLS ఈసర్వీసెస్ కంపెనీ మరోసారి రుచి చూపించింది.ఈ స్టాక్ అలాట్‌మెంట్ రేటు రూ.135కాగా..రూ.305 దగ్గర ట్రేడ్ ఓపెన్ చేసింది. దీంతో ఎకాఎకిన 130శాతం లాభం పంచినట్లైంది.  అనలిస్టులు అంచనా వేసినట్లే ఈ లాభం ఉండటంతో..స్టాక్ అలాటైనవాళ్లు పండగ చేసుకుంటున్నారు



రూ.311 కోట్ల ఇష్యూ కాగా, 162రెట్ల ఆదరణ దక్కిందీ ఐపిఓకి..!


బ్యాంకులకు డిజిటల్ సర్వీసులతో పాటు కరెస్పాండెన్స్ సర్వీసులను అందించే కంపెనీగా BLS E సర్వీసెస్ సంస్థకి పేరు

దేశంలోని అన్ని ప్రభుత్వసంస్థలకు ఇదే గ్రాస్ రూట్ లెవల్‌లో సర్వీసులను ప్రొవైడ్ చేస్తోంది. కంపెనీకి వచ్చే ఆదాయంల

66శాతం ఇలానే వస్తుంది. 


BLS ఈ సర్వీసెస్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో రూ.348.40కికూడా చేరాయి. ఇది అలాట్‌మెంట్ రేటుతో పోల్చితే

150శాతంకంటే ఎక్కువ

స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి BLS E-సర్వీసెస్ షేర్లు రూ.325 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments