లుక్ &వ్యూ కోసం రూ.118 కోట్లు


సరైన వ్యూ ఉఁడాలే కానీ..ఏదైనా సాధ్యపడుతుందనేది కొందరి అభిప్రాయం..ఐతే ఇండియన్ మార్కెట్లలో బిగ్‌బుల్‌గా చెప్పే రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా గుర్తున్నారు కదా..ఆయన భార్య రేఖ కూడా ఇదే వ్యూ ఫాలో అవుతున్నారు. ఐతే ఇది సైట్ వ్యూకి సంబంధించి..



అరేబియా సముద్రం ఎదురుగా ఓ అద్భుతమైన అపార్ట్‌మంట్ కొనుగోలు చేశారామె. రేర్ పేరుతో ఉన్న ఈ విల్లా హౌస్‌, రాక్‌సైడ్ CHS అనే పోష్ బిల్డింగ్ పక్కనే ఉంది

ఇదే కాకుండా మరో ఆరు భవంతులు కూడా ఇక్కడ రీవర్క్స్ చేస్తున్నారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ఈ పనులు చేస్తుండగా, ఇక్కడే ఎంటర్ అయ్యారీమె

తన మలబార్ హిల్స్ నుంచి సముద్రాన్ని చూసే ఓ బ్యూటిఫుల్ వ్యూ మిస్ కాకూడదని ఏకంగా ఈ నిర్మాణంలో ఉన్న అన్ని భవంతులను కొనేసారు

ఈ తొమ్మిది  అపార్ట్‌మెంట్లను 118 కోట్లకు కైవసం చేసుకున్నారు...24 అపార్ట్‌మెంట్లలో 19 కొనేశారు.ఎంత ఖర్చైతే ఏంటి..లుక్ అండ్ ఫీల్ నాకు ముఖ్యం

అనేది ఆమె ఫీలింగ్ అని అర్థమవుతోంది. 


స్టోరీ రాసేటప్పటికి ఆమె ఆస్తులు..షేర్ల విలువ అంతా కలిపి దాదాపు 68వేలకోట్లు..! మరి ఇంత ఆస్తి ఉన్నప్పుడు వ్యూ కోసం

ఆమాత్రం ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదనుకోండి..ఐనా ఆ కొన్న అపార్ట్‌మెంట్లను కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా వినియోగిస్తారనడంలో

సందేహం లేదు.

Comments