ఏంజెల్‌వన్ భారీగా నిధుల సేకరణకు సిద్ధమైంది. గతనెలలో ప్రకటించినట్లుగానే
2వేలకోట్లరూపాయలకిపైగా నిధులను సేకరించడానికి క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ పద్దతిని ఆశ్రయించింది. షేరుకు రూ.2555ఫ్లోర్ ప్రైస్‌తో క్విప్ లాంఛ్ చేయనుంది
ఈ రేటు ప్రస్తుత మార్కెట్ రేటు కంటే దాదాపు 7శాతం తక్కువ
వ్యాపారం పెంచుకునేందుకు,బ్రోకింగ్ వ్యాపారంలో మరింత దూసుకుపోయేందుకే ఏంజెల్‌వన్ భారీగా నిధులను సమకూర్చుకుంటున్నట్లు చెప్తోంది. అలానే ఫిన్‌టెక్ స్పేస్‌లో కొత్త అవకాశాలను కూడా అన్వేషిస్తోన్నట్లు కంపెనీ ఫిబ్రవరిలో చెప్పిన నేపథ్యంలో తాజా నిధుల సేకరణ ఆసక్తి కలిగిస్తోంది.
Comments
Post a Comment