డబ్బు భలే జబ్బు,పాతఫోటో తెచ్చిన చిక్కు


బెంజమిన్ బాసుమటారీ..అస్సోం యునైటెడ్ పీపుల్స్ పార్టీ నుంచి సస్పెండైన ఓ మెంబర్

ఇతగాడు చేసిన ఓ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా మనోడికి పాపులారిటీ తెచ్చిపెట్టింది

పక్కమీద 500 నోట్లను పరుచుకుని...వాటిమీద నిద్రపోతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఓ ఫోటో దిగాడు

ఇది అస్సోంలోనే కాకుండా..ట్విట్టర్ లోకమంతా వ్యాపించింది. అసలే మనోడిపై పిఎఁ హౌసింగ్ స్కీమ్ విషయంలో

బోలెడంత డబ్బు తినేశాడనే ఆరోపణలు ఉన్నాయ్..ఈ నిందలతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు



ఇంతకీ ఈ పార్టీ బిజెపి అలయన్స్ కావడంతో..కాంగ్రెస్ సహా, మిగిలిన పక్షాలు ఈ ఫోటోని బేస్ చేసుకుని

ఆటాడుకోవడం ప్రారంభమైంది..యునైటెడ్ పీపుల్స్ పార్టీ ..బాసుమటారీతో మాకు సంబంధం లేదని

దూరం జరగగా..అసలీ ఫోటో ఇప్పటిది కాదని..ఐదేళ్ల క్రితం పార్టీ జరుగుతుండగా తీసినదని..అతని సపోర్టర్లు కవర్

చేస్తున్నారు

Comments