ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరుగుతోందనే ప్రశ్న వస్తోంది
రెండు రోజుల క్రితం జర్మనీ దేశం నుంచి ఈ విషయంలో ఫెయిర్ ఎంక్వైరీ జరగాలంటూ
ప్రకటన వచ్చిన రెండో రోజే అమెరికా కూడా ఇదే విధమైన స్పందన వచ్చింది
ఇది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్..!
అమెరికా ..ఢిల్లీ సిఎం అరెస్ట్ వ్యవహారం, ఆయనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ..
పారదర్శకతతో వివక్షలేని విచారణ, దర్యాప్తు జరగాలి అంటూ ప్రకటన విడుదల చేసింది. ఇది
మన దేశవ్యవహారాల్లో వేలెట్టడమే అయినా కూడా..వరసగా రెండు అగ్రదేశాలు ఇలా
స్పందించడం కలకలం రేపుతోంది..చూసేవాళ్లకి ఇదో పెద్ద బిల్డప్ కావచ్చుకానీ,,మోదీ ప్రభుత్వం
దర్యాప్తు సంస్థల తీరు సరిగా లేదనే కలరింగ్ ఇస్తున్నట్లైంది..
దీనికి మన తరపున దీటైన సమాధానం ఇస్తున్నా..ఇతర దేశాల ప్రశ్నలకు కాసింత డిఫెన్స్‌లో పడ్డట్లే
కన్పిస్తోంది.
Comments
Post a Comment