ఐక్యరాజ్యసమితి కూడానా

 ఐక్యరాజ్యసమితి కూడానా


ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి కూడా పరోక్షంగా కామెంట్ చేసింది

ఏ దేశంలోనైనా పౌరుల హక్కులు కాపాడబడాలని..ఆశిస్తున్నట్లు చెప్పింది..ఎన్నికలు జరిగే ఏ దేశంలోనైనా

ఇవి తప్పనిసరి అని వాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కి అధికారప్రతినిధిగా

వ్యవహరించే  స్టీఫాన్ డుజారిక్ ఇలా కామెంట్ చేశారు



ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో విలేకరులు..భారత్‌లో ఓ రకమైన అనిశ్చితి నెలకొని ఉందంటూ కొంతమంది

ప్రస్తావించిన నేపథ్యంలోనే ఆయన ఇలా స్పందించారు. అంతటితో ఆగకుండా..స్వేచ్ఛగా..పారదర్శకంగా

ఎన్నికలు జరగాలంటూ చెప్పడం విడ్డూరం..అక్కడికేదో..మన దేశంలో పాకిస్తాన్ సహా ఇతర దేశాల్లోలాగా విపరీతమైన

హింస చోటు చేసుకునేలాగా మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. 

Comments