స్టాక్ మార్కెట్లు ఉదయం మనం వేసిన అంచనాకి తగినట్లుగానే అప్ బీట్ వేస్తున్నాయ్
నిఫ్టీ ఇంట్రాడేలో బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ తీసుకుంది. 234 పాయింట్లకిపైగా లాభపడింది
ఎకాఎకిన 22వేల పాయింట్లను దాటేసి సాలిడ్‌గా ట్రేడవుతోంది. మరో గంటలో మరో 100 పాయింట్లు
లాభపడినా ఆశ్చర్యం లేదు
సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 72882 పాయింట్లకు జంప్ చేసింది
బ్యాంక్ నిఫ్టీ ఒకటిన్నరశాతం వరకూ ర్యాలీ చేసింది. ఐటి ఇండెక్స్ ఒకశాతం
లాభంతో ట్రేడవుతోంది.అన్ని రంగాల్లో ఉత్సాహం కన్పిస్తుండగా గత నాలుగు సెషన్లుగా
చితికిపోయిన PSE ఇండెక్స్ 3శాతం ర్యాలీ చేసింది
దీంతో టాప్ గెయినర్లుగా ఎన్టీపిసి,బిపిసిఎల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో
మూడునుంచి నాలుగు శాతం వరకూ దంచికొట్టాయ్. లూజర్లుగా నెస్లే,హీరోమోటోకార్ప్
నామమాత్రం పావుశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment