షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నేతృత్వంలోని కంపెనీ ఒకటి ఐపిఓకి రాబోతోంది. ప్రస్తుతం హాట్ సెక్టార్ అయిన ఇన్‌ఫ్రాలో..షాపూర్జీ సంస్థకి ఉన్న
పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే సంస్థకి చెందిన ఇంజనీరింగ్ ప్లేయర్ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లను సమీకరించడానికి సెబీకి DRHP సబ్మిట్ చేసింది.ఈ ఇష్యూలో ప్రెష్ సేల్ రూ.1,250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.5,750 కోట్లు సమీకరించనున్నారు
13 దేశాలలో 67 యాక్టివ్ ప్రాజెక్ట్‌లు ఉన్న ఈ ఆఫ్యాన్క్ ఇన్‌ఫ్రా ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంది
వాటిలో అటల్ టన్నెల్, హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్, ఢిల్లీ - మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో ఫేజ్ IV కూడా కొన్ని..!
కంపెనీ ఆర్డర్ బుక్ వేల్యూ 34,888 కోట్లు కాగా, ఇందులో రూ. 26,093 కోట్ల దేశీయ ఆర్డర్ బుక్, రూ. 8,795.32 కోట్ల ఓవర్సీస్ ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది.
ఇక ఐపిఓ ద్వారా.. గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎఫ్‌ఎస్‌లో దాదాపు రూ.5,750 కోట్ల విలువైన వాటాలను విక్రయించి ఎగ్జిట్ అవనున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ 2023 నాటికి, సంస్థలో గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 72.35 శాతం వాటా ఉండగా, షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీకి 16.64 శాతం వాటా ఉంది. ఇష్యూ ద్వారా వచ్చినదాంట్లో రూ. 150 కోట్లు మూలధన వ్యయానికి, రూ. 350 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించనున్నారు.
రూ. 500 కోట్లను కంపెనీ డెట్ క్లియర్ చేయనున్నారు.డిసెంబర్ 2023 నాటికి ఈ కంపెనీకి రూ. 2887.59 కోట్ల డెట్ ఉంది
Comments
Post a Comment